Sonu Nigam : ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పై రాళ్ళ దాడి

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సింగర్ సోనూ నిగమ్‌(Singer Sonu Nigam)పై రాళ్ల దాడి(Stone Attack) జరిగింది.

Update: 2025-03-25 12:59 GMT
Sonu Nigam : ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పై రాళ్ళ దాడి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ సింగర్ సింగర్ సోనూ నిగమ్‌(Singer Sonu Nigam)పై రాళ్ల దాడి(Stone Attack) జరిగింది. అయితే ఈ ఘటన మార్చి 23న ఆదివారం ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ(DTU)లో జరిగిన ఎంగిఫెస్ట్ 2025(Engifest 2025) సందర్భంగా చోటు చేసుకుంది. సోనూ నిగమ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో లక్షకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షో జరుగుతుండగా.. సమూహంలోని కొందరు రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను వేదిక వైపు విసిరారు. ఈ దాడి వల్ల ఆయన తన షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో సోనూ నిగమ్ గాయపడలేదని, కానీ అతని బృందంలోని కొందరు సభ్యులు గాయపడ్డారని సమాచారం.

రాళ్లు విసురుతున్న వారిని చూసి.. "నేను మీ కోసం ఇక్కడికి వచ్చాను, దయచేసి ఇలా చేయొద్దు." అని ఆయన విన్నవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పరిస్థితి అదుపులోకి వచ్చాక సోనూ నిగమ్ తన షోను కొనసాగించడం విశేషం. అయితే ఈ దాడి గురించి ఇటు సోనూ నిగమ్ గాని, అటు వర్శిటీ నిర్వాహకులు గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.  

Tags:    

Similar News

Monami Ghosh