Menstrual Health: నెలకు రెండుసార్లు పీరియడ్స్ అవుతున్నాయా?.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే
ప్రతి అమ్మాయి జీవితంలో పీరియడ్స్ అనేది సర్వ సాధారణం.
దిశ, ఫీచర్స్: ప్రతి అమ్మాయి జీవితంలో పీరియడ్స్ అనేది సర్వ సాధారణం. ఈ ప్రక్రియ 13 లేదా 14 ఏళ్లకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 24 నుంచి 38 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా అకస్మాత్తుగా నెలకు రెండుసార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో తెలియక ఆందోళన చెందుతుంటారు. మరి అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి? ఎలా నివారణ పొందాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నెలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పీరియడ్స్ రావడాన్ని ‘సక్రమంగా లేని రుతుక్రమం’ అని అంటారు. కానీ ఈ రకమైన సమస్య చాలా అరుదుగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగానే, నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. అరుదుగా వస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ,.. ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఇలా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల ఒవేరియన్ ట్యూమర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అయితే చాలా సార్లు, శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ సమతుల్యత కోల్పోతుంది. ఒత్తిడి పెరిగినా, ఆహారంలో మార్పు వచ్చినా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. పీసీఓడీ, థైరాయిడ్, ఫ్రై బోయిడ్ సమస్యల కారణంగా కూడా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
ఉపశమనం పొందే చిట్కాలు..
1) అల్లం:
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు అల్లం చక్కగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల రుతుచక్రం సాధారణం అవుతుంది. అలాగే పీరియడ్స్ క్రాంప్స్, అధిక రక్తస్రావం, వికారం, అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది.
2) దాల్చిన చెక్క:
పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు PCODతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో దాల్చిన చెక్కను ఖచ్చితంగా చేర్చుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల పీరియడ్స్ సమస్య క్రమంగా తగ్గుతుంది.
3) యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవల్స్, హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
4) జీలకర్ర:
చాలా మంది బరువు తగ్గేందుకు జీలకర్ర వాటర్ తాగుతుంటారు. పీరియడ్స్ సమస్యల నివారణకు కూడా జీలకర్ర నీటిని తాగొచ్చు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల రుతుక్రమం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
5) పసుపు:
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.