Solitude: ‘ఏకాంతం’.. గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక ఉత్తమ మార్గం..!

ఏకాంతం(Solitude) మనిషికి ఎక్కడికో తీసుకెళ్లగలదు. సింగిల్ ఎన్‌లైటెన్మెంట్(single enlightenment) కూడా ఓ రకంగా సంతోషానిస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-12-29 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏకాంతం(Solitude) మనిషికి ఎక్కడికో తీసుకెళ్లగలదు. సింగిల్ ఎన్‌లైటెన్మెంట్(single enlightenment) కూడా ఓ రకంగా సంతోషానిస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఏకాంతంగా గడిపినప్పుడే తెలుస్తుంది. మీరు వర్కులో బిజీగా ఉన్నప్పుడో, ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చినప్పుడో, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడో అరుదుగానైనా సరే సడెన్‌గా ఒక ఆలోచన వస్తుంది. అదే ‘ఐ నీడ్ రెస్ట్’(I need rest) లేదా ‘ఐ నీడ్ స్పేస్’(I need space). ఎందుకంటే ఆ సందర్భంలో కొంత సమయాన్ని కేటాయించుకోవడం, ఏకాంతంగా గడపడం అనేది మానసిక అలసటను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

కాగా ఆ సమయంలో వ్యక్తి తనతో తాను మాట్లాడుకునే అవకాశం దొరుకుంది. అప్పుడే తన గురించి తాను తెలుసుకుంటాడు. తనలోని లోపాల(errors)ను గుర్తించి.. తన తప్పుల్ని సరిదిద్దుకుంటాడు. అంతేకాకుండా జీవితంలో ఏం చేయాలని తన గోల్ ఏంటో తెలుసుకుంటారు. అనేక విషయాల గురించి నెమరువేసుకోవడానికి ఏకాంతంగా గడపడం ముఖ్యం.

ఏకాంతం ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు(Great ideas) చేస్తుంది. ఆలోచనల సంఘర్షణలకు అవకాశమిచ్చి, అవసరమైన వాటిని ఎంపిక చేసుకుని ఆచరణలో పెట్టడానికి సహాయం చేస్తుంది. ‘ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారు’ అనే వ్యక్తులు జీవితంలో సక్సెస్ సాధించిన రుజువులు అనేకం ఉన్నాయి. అందుకు చక్కటి ఉదాహరణ గౌతమ బుద్ధుడు(Gautama Buddha). ఏకాంత ప్రదేశంలోనే అతనికి జ్ఞానోదయం(Enlightenment) అయింది. అది ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శకం అయింది.

కాగా మీ ఆలోచనలు, ఏకాంత క్షణాలు మీ ఎదుగుదలకు సహాయపడతాయి. కాగా చక్కటి పరిష్కారాల కోసం ఏకాంతంగా గడపండి. గొప్ప గొప్ప ఆలోచనలు.. మిమ్మల్ని జీవితంలో మంచి స్థాయికి తీసుకెళ్లే దారిని అవే చూపిస్తాయంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News