White hair: వాతావరణంలో మార్పులు.. వైట్ హెయిర్‌కు కారణమవుతుందా..?
ప్రజెంట్ డేస్‌లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జట్టు సమస్యతో బాధపడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జట్టు(white hair) సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు తెల్లజుట్టు వయస్సు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రజెంట్ చిన్న పిల్లల(children)కు కూడా వైట్ హెయిర్స్ రావడం కామన్ అయిపోయింది. ఈ వైట్ హెయిర్ వల్ల పలు ఫంక్షన్స్, కార్యక్రమాలకెళ్లాలన్నా.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నలుగురిలో అన్‌కంఫార్టెబుల్‌గా ఫీల్ అవుతుంటారు. అయితే తెల్ల జుట్టుకు కారణాలేంటో తాజాగా నిపుణులు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వరల్డ్‌వైడ్‌గా మారుతున్న పర్యావరణ వ్యవస్థ(ecosystem), ఆహార గొలుసుపై ప్రతికూల ప్రభావాలు కొంత కారణం అవుతున్నాయని అంటున్నారు.
అలాగే ఆహారంలో లోపిస్తున్న పోషకాలు(Nutrients) ఓ కారణం. వీటిలో పాటు విటమిన్లు, మానసిక ఒత్తిడి(Mental stress), మద్యపానం(drinking), స్మోకింగ్(smoking) వంటి అలవాట్లు కూడా వైట్ హెయిర్ రావడానికి కారణమవుతున్నాయి. అయితే ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటే వైట్ హెయిర్ రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా మెంటల్ స్ట్రెస్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మిమ్మల్ని ఒత్తిడి(stress)కి గురిచేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలి. అంటే మీ లైఫ్‌స్టైల్ ఛేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజూ మెడిటేషన్(Meditation), యోగా(yoga), డీప్ బ్రీత్(deep breathing) వంటివి స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణం బి 12 లోపించడం ఓ కారణమే. కాబట్టి బి 12 అధికంగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా కోడిగుడ్లు(Eggs), మిల్క్ ప్రొడక్ట్స్(milk products), పప్పు ధాన్యాలు(pulses) ఇందుకు హెల్ప్ అవుతాయి. వీటితోపాటు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్(Minerals), యాంటీ ఆక్సిడెంట్స్(antioxidants) కలిగిన ఆకుకూరలు(Greens), గ్రీన్ వెజిటేబుల్స్(green vegetables), సీడ్స్(seeds), నట్స్(nuts), ఫిష్(fish), మాంసం(meat) వంటివి చిన్నప్పటి నుంచి ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే, యంగ్ ఏజ్‌లో తెల్లజుట్టు రావడానికి బ్రేక్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More...
Remedies: టాన్సిల్స్‌తో సఫర్ అవుతోన్న పిల్లలు.. పరిష్కార మార్గాలు..?