Self confidence: ఆత్మ విశ్వాసాన్ని పెంచే అద్భుత మార్గాలు..!
ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఇదొక్కటి ఉంటే చాలు.. మీరు కోల్పోయినవన్నీ తిరిగి సాధించుకోవచ్చు. సె
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం(self confidence) ముఖ్యం. ఇదొక్కటి ఉంటే చాలు.. మీరు కోల్పోయినవన్నీ తిరిగి సాధించుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోరు. లేకపోతే ఏ పని చేయడానికి కూడా ముందడుగు వేయరు. మరీ మీపట్ల మీరు నమ్మకంగా, కాన్ఫిడెంట్‌గా ఉండేందుకు అనుసరించాల్సిన కొన్ని ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ్రత పాటించడం..
మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే తరచూ శుభ్రత పాటించడం(Cleanliness) ముఖ్యం. ఆకట్టుకునే అలంకరణ కూడా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్లీన్‌గా షేవ్ చేసుకోవడం(Clean shaven)నీట్‌గా తయారు అవ్వడం, హుందాతనాన్ని కలిగి ఉండడం కూడా ఇతరులకు గౌరవాన్ని పెంచుతాయి. అలాగే సువాసనలు కలిగిన పర్ఫ్యూమ్స్(Perfumes) మీలో మంచి అనుభూతిని పెంచుతాయి. డ్రెస్పింగ్ విధానం(Dressing procedure) కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో మేలు చేస్తుంది.
టైంకు నిద్రపోవాలి..
సమయానికి నిద్రపోకపోతే నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి.దీంతో మెదడు చురుకుదనాన్ని(Brain activity) కోల్పోతుంది. దీంతో ఆందోళన, ఆత్రుత(anxiety), టెన్షన్, ఎమోషనల్(emotional) వంటి భావోద్వేగాలను మేనేజ్ చేయడలో విఫలం అవుతారు. పనిలో ప్రొడక్టివిటీ(Productivity) తగ్గిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. కాగా నిద్రలేమి(Insomnia) కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోవడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాజిటివ్‌గా మాట్లాడండి..
ఇతరులతో పాజిటివ్‌గా మాట్లాడడం(Speaking positively) నేర్చుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది వంకర మాటలతో మనసు విరిగేలా మాట్లాడుతారు. మరికొంత మంది మాట్లాడుతుంటే ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. వారు చెప్పే ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే.. మాటతీరులో ఎక్కువ భాగం పాజిటివిటీ ఉంటుంది. అది మన హృదయాన్ని తాకుతుంది.
ఇతరులతో పోల్చుకోవద్దు
కొందరు తమ కోసం తాము ఆలోచించుకోవడం(think) కంటే కూడా ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు. తమ జీవితాలను మరొకరితో పోల్చుకుంటూ బాధపడుతుంటారు. నిజానికి స్వయం ఎదుగుదలకు ఇది పెద్ద ఆటంకం. లైఫ్‌లో ఏ ఇద్దరి ఆలోచనలు, ఆచరణ ఒకేలా ఉండవు. ఎవరి పద్ధతిలో వారు మెరుగైన దిశగా ముందుకు సాగుతుంటారు. ఇతరుల్లో మీకు ఏదైనా నచ్చితే స్ఫూర్తి పొందాలి తప్ప, అచ్చం అలాగే చేయాలని, అలాగే ఉండాలని అనుకోవద్దు. మీ పద్ధతిలో మీరు ప్రయత్నించండి. పోల్చుకోవడం ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మీ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నిస్తారు. అది మీలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
దయాగుణం.. సేవాభావం
దయా గుణం(Kindness), సేవాభావం(sense of service), ఉదారత్వం(generosity) నలుగురిలో మీకు మంచి గుర్తింపు తెస్తాయి. మీలో మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీంతో మీలో విశ్వాసం(faith) పెరుగుతుంది. అలాగే అప్పుడప్పుడైనా మీరు స్వయం సేవకంగా ఉండాలి. ఇతరులకు మీ చేతనైన సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంవల్ల సంతృప్తి కలుగుతుంది. అది సెల్ఫ్ కాన్ఫిడెంట్‌ను కూడా పెంచుతుంది. అలాగే సందర్భాన్ని బట్టి మీ మాట తీరు ఉండాలి. ప్రతీ విషయానికి ఆవేశం, ఆందోళన తగదు. ఇతరులకు అర్థమయ్యేలా కాస్త స్లోగా మాట్లాడటాన్నే చాలామంది విలువైనదిగా భావిస్తారు.
వైఫల్యాలను స్వీకరించండి..
వైఫల్యాల(failures)ను చూసి భయపడినవారు ఓడిపోతారు. కానీ వాటిని గుణపాఠంగా స్వీకరించిన వారిలో మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఫైనల్‌గా అది సక్సెస్ వైపు నడిపిస్తూనే ఉంటుంది. అందుకే ఫెయిల్యూర్‌ను జీవితంలో ఒక భాగం అని గ్రహించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తమను తాము తీర్చిదిద్దుకునే ఆత్మ విశ్వాసాన్ని పొందుతారు.