Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే తలెత్తే వ్యాధుల లిస్ట్..!

ఈ ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది ఉదయం టిఫిన్(breakfast) తినడం మానేస్తున్నారు.

Update: 2024-12-29 04:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది ఉదయం టిఫిన్(breakfast) తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవనానికి బ్రేక్ ఫాస్ట్ చేయడం ప్రధానమని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరీ టిఫిన్ తినడం మానేస్తే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో నిపుణులు చెప్పినవి ఓ సారి చూద్దాం..

బ్రేక్ ఫాస్ట్ స్కిన్ చేయడం వల్ల మధుమేహం(diabetes) వచ్చే ప్రమాదం ఉంది. మార్నింగ్ టిఫిన్ చేయకపోతే రక్తంలో షుగర్ లెవల్స్(Sugar levels) పెరుగుతాయి. ముఖ్యంగా చాలా వీక్‌గా తయారవుతారు. అంతేకాకుండా కళ్లు తిరగడం, ఏ పని మీద శ్రద్ధ వహించకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో ఇమ్యూనిటి పవర్(Immunity power) తగ్గిపోతుంది. ఎక్కువ సమయం పాటు ఫుడ్ తీసుకోకపోవడం కారణంగ కణాలు దెబ్బతింటాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

ఉదయం టిఫిన్ తినకపోతే బరువు పెరుగుతున్నారని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే జీవక్రియ మందగిస్తుందని(Metabolism slows down), జీర్ణక్రియ(digestion)కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా శరీర మెటబాలిజం(Metabolism) వల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. మైగ్రేన్(Migraine), తీవ్రమైన తలనొప్పి(severe headache), వాంతులు(vomiting), వికారం(nausea) వంటి సమస్యలు వస్తాయి.

అలాగే ఉబకాయం(Obesity), గ్యాస్ ఫామ్(Gas farm) అవ్వడం, అల్సర్(Ulcer) వస్తుంది. టిఫిన్ మానేస్తే శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. కోపం, చికాకు వంటివి పెరుగుతాయి. రక్తంలో షుగర్ లెవల్స్(Sugar levels) పెరుగడంతో పాటు పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు(Insomnia problems), జ్జాపకశక్తి తగ్గిపోవడం(Insomnia problems...), మానసిక ఆందోళన(Mental anxiety), బ్రెయిన్ యాక్టివిటీ(brain activity)లో ప్రతికూల మార్పులు, కడుపు నొప్పి(Abdominal pain), పొట్ట ఉబ్బరం(bloating), పేగు కదలికల్లో(bowel movements) అవాంతరాలు ఏర్పడటం, యాసిస్ రిఫ్లక్స్(Acid reflux) వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Read More...

పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా.. అధ్యయనం ఏం చెబుతుంది?


Tags:    

Similar News