Tomato curd Recipe: టమాటో పెరుగుపచ్చడి .. ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌

టమాటో పెరుగుపచ్చడి

Update: 2024-08-09 14:11 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి కూరలో టమాటోలను వాడుతుంటాం ఎందుకంటే దీన్ని వేసుకున్న తర్వాత మంచి రుచినిస్తుంది. బిర్యానీ చేసినప్పుడు ఆ రోజూ కొంచమైనా పెరుగుపచ్చడి తయారు చేసుకుంటాం. భారతీయ వంటకాల్లో ఇది చాలా ఫేమస్. కొందరు ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీరతో చేస్తుంటారు. అయితే, మనలో చాలా మందికి టమాటో పెరుగుపచ్చడి గురించి తెలిసి ఉండదు. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

టమాటాలు 3, 1 కప్పు పెరుగు , పచ్చిమిర్చి - 2 , కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్  జీలకర్ర, 2 ఎండు మిర్చి, 1 టీ స్పూన్ శనగలు, వెల్లుల్లి 2 రెబ్బలు.

తయారీ విధానం

టమాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ కోసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిని ముక్కలుగా కోసుకుని దీనికి టమాటో మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, శనగలు వేసి కొంతసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత చల్లబరిచి, దీనికి టమాటో మిశ్రమాన్ని యాడ్ చేయాలి. కొత్తిమీరను చిన్నగా కోసి, ఉప్పు కలిపి టమాటో మిశ్రమానికి కలపాలి. చివరిగా పెరుగును కలిపి మెత్తగా అయ్యే వరకు తిప్పుకోవాలి. అంతే టమాటో పెరుగుపచ్చడి.

Tags:    

Similar News