తల్లి శ్మశానంలో.. కొడుకు ఐసీయూలో.. ఆ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవి..?
పుష్ప2 సినిమా ప్రీమియర్ షో టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్ బెడ్‌పై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప2 సినిమా ప్రీమియర్ షో టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్ బెడ్‌పై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నా.. ఇంకా డేంజర్ నుంచి బయటపడలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి.. ఆ రోజు రేవతి భర్త తన కుటుంబంతో కలిసి థియేటర్‌కి సినిమా చూడటానికి రాకపోయినా.. లేదంటే అల్లు అర్జున్ థియేటర్‌కి రాకుండా ఉన్నా.. ఒకవేళ వచ్చినా థియేటర్ మెనేజ్‌మెంట్ మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ కరెక్ట్‌గా తీసుకుని ఉన్నా.. కనీసం అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ ఉన్మాదంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించకపోయినా.. ఇప్పుడు రేవతి ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్పగా జరిగేవి.
రేవతి భర్త ఉదయాన్నే లేచి మార్కెట్‌కి వెళ్లి చికెన్, మటన్ తెచ్చేవాడు. ఇంట్లో రేవతి ఎంతో రుచిగా కర్రీ, స్వీట్స్ చేసేది. శ్రీతేజ్ తన చెల్లెలితో కలిసి కొత్త బట్టలు వేసుకుని స్కూల్లో, ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి చూపించుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. సాయంత్రం ఇంట్లో వాళ్లంతా కలిసి సినిమాకో, షికారుకో వెళ్లి తిరిగొచ్చి ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లు. కానీ ఇప్పుడు.. వాళ్ల కుటుంబంలో ఆనందం అనేదే లేకుండా పోయింది. ఇంటి దీపం ఇల్లాలు ప్రాణాలే పోగొట్టుకుని శాశ్వతంగా దూరమైపోయింది. నాన్నకి కుడిభుజంలా ఉంటాడనుకున్న కొడుకు ఇప్పటికీ ప్రాణాల కోసం హాస్పిటల్‌లో పోరాడుతూనే ఉన్నాడు.
ఇక ఆ పాప.. అమ్మ ఎక్కడికెళ్లిందో తెలీదు. అన్నయ్య హాస్పిటల్ బెడ్‌పై ఎందుకు పడి ఉన్నాడో తెలీదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నాన్న.. నెల రోజుల నుంచి ఎందుకు నవ్వడం లేదో తెలీదు. అమ్మ చేయాల్సిన వంట నాన్న చేసి పెడుతున్నాడు. స్నానం చేయించి రెడీ చేస్తున్నాడు. సడెన్‌గా ఇదంతా ఎందుకు మారిపోయిందో పాపం తెలియక ఆ చిన్నారి భరించలేని ఆవేదన అనుభవిస్తోంది. ఇక అందరికంటే దయనీయమైన పరిస్థితి ఆ తండ్రిది. ఇన్నాళ్లూ తనతో కలిసి కష్టంలో, సుఖంలో తోడున్న భార్య ఇప్పుడు ప్రాణాలతోనే లేదు. ఇక తన ఆనందాన్ని, బాధని ఎవరితో పంచుకోవాలో తెలీదు. ఇంకోపక్క తనకి పెద్దై కుడి భుజంగా మారతాడనకున్న కొడుకు బతకడం కోసం విశ్రాంతి లేకుండా పోరాడుతున్నాడు. ‘నాన్నా.. అమ్మెక్కడ..? అన్నయ్యెందుకు బెడ్‌పై నుంచి లేవట్లేదు?’ అని అభం శుభం తెలియని కూతురు అడుగుతుంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక ఉబికి వస్తున్న కన్నీళ్లని తుడుచుకుంటూ.. ‘అమ్మా! అమ్మ దేవుడి దగ్గరకెళ్లింది. అన్నయ్య బాగా ఆడి ఆడి అలసిపోయాడు కదా.. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు’ అని సర్ది చెప్పి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. ఒక్క రాత్రి అతడి జీవితాన్ని ఇంతలా మార్చేస్తుందని.. ఒక్క ఘటన ఆనందంగా ఉన్న తన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుందని పాపం అతను ఎప్పుడూ అనుకుని ఉండడు. పాపం.
Read More ...
మీ ఫ్రెండ్స్‌కు మొత్తం 24 భాషల్లో HAPPY NEW YEAR చెప్పండి.. అవేంటంటే?