Allu Arjun : కాసేప‌ట్లో నాంప‌ల్లి కోర్టుకు అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ఈ రోజు నాంపల్లి కోర్టు(Nampally Court)కు రానున్నారు.

Update: 2025-01-04 07:00 GMT

దిశ, వెబ్ డెస్క్ :  హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ఈ రోజు నాంపల్లి కోర్టు(Nampally Court)కు రానున్నారు. కోర్టు తనకు మంజూరు చేసిన రెగ్యుల‌ర్ బెయిల్(Regular bail) కు సంబంధించిన పూచిక‌త్తు(Guarantors) పేప‌ర్లను స్వయంగా సమర్పించేందు(Submit Self)కు అల్లు అర్జున్ కోర్టుకు రానున్నారు. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో వ్యక్తిగ‌తంగా హ‌జ‌రు కావాల‌న్న బెయిల్ ష‌ర‌తును స‌డ‌లించాల‌ని ఈ సందర్భంగా న్యాయ‌మూర్తిని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేసే అవ‌కాశం ఉందని సమాచారం.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్ధని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్ధేశించింది. 

Tags:    

Similar News