Sleeping glasses : ఈ కళ్లజోడు ధరిస్తే చాలు.. ఫుల్లుగా నిద్రపట్టేస్తుంది!

Sleeping glasses : ఈ కళ్లజోడు ధరిస్తే చాలు.. ఫుల్లుగా నిద్రపట్టేస్తుంది!

Update: 2025-01-01 08:24 GMT

దిశ, ఫీచర్స్ : కంటి సమస్యలు ఉన్నప్పుడు కళ్లజోడు వాడటం సహజమే. దీనివల్ల దృష్టి లోపాలను అధిగమించవచ్చు. కానీ ఇక నుంచి మీరు నిద్రరాకపోయినా ధరించగలిగే కళ్లజోడును రూపొందించారు ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్. కాగా ఆయన ప్రముఖ ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ కోసం ఈ హైటెక్ లైట్ థెరపీ గ్లాసెస్‌ను తయారు చేయగా, ప్రస్తుతం సదరు కంపెనీ రీటైమర్ -3 పేరుతో ఈ కళ్లజోడును మార్కెట్లో రిలీజ్ చేసింది.

దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు హైటెక్ లైట్ థెరపీ కళ్లజోడును ధరిస్తే హాయిగా నిద్రపడుతుంది. అయితే ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సరికొత్త గాగుల్‌ని ధరించినప్పుడు దాని నుంచి ఓ నిర్ణీత తరంగ ధైర్ఘ్యంలో బ్లూ అండ్ గ్రీన్ కలర్‌‌లో‌ని కాంతి వెలువడుతుంది. ఇది కళ్లమీద పడటంవల్ల అలసటను పోగొడుతుంది. అంతేకాకుండా ఈ కళ్లజోడు నుంచి వెలువడే కాంతి తరంగాలు శరీర జీవగడియారానికి అనుకూలంగా పనిచేయడం వల్ల నిద్రలేమిని దూరం చేస్తాయి. క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపిస్తాయి. కాగా ప్రస్తుతం ఈ కళ్లజోడు ధర 179 డాలర్లు(రూ. 15, 021)గా ఉందని నిపుణులు చెబుతున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. 

Tags:    

Similar News