Coffee benefits : కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇలా తాగితే గుండె జబ్బుల రిస్క్ తగ్గినట్టే!

Coffee benefits : కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఇలా తాగితే గుండె జబ్బుల రిస్క్ తగ్గినట్టే!

Update: 2025-01-01 07:37 GMT

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో అత్యధికమంది ఫేవరెట్ డ్రింక్స్‌లో కాఫీ ఒకటి. కొందరికి పొద్దున్న లేవగానే తాగకుంటే ఏమీ తోచదు. ఇక నలుగురు ఫ్రెండ్స్ కలిసినా, ఇంటికి అతిథులొచ్చినా కొందరు వెంటనే అడిగే మాట కాఫీ తాగుతారా? అని. ఇలాంటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కాఫీలో కెఫిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తాగితే తలొనప్పి, మైగ్రేన్, నిద్రలేమి సహా పలు రకాలహెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయని చెబుతుంటారు. కానీ ఓ తాజా అధ్యయనంలో మాత్రం కాఫీ ఆరోగ్యానికి మంచిదని తేలింది. పైగా మితంగా తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గుతుందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం’లో పబ్లిషైన అధ్యయన వివరాల ప్రకారం.. కాఫీని లిమిటెడ్‌గా తాగే వారిలో గుండె జబ్బులు, మధుమేహం, కార్డియో మెటబాలిక్ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. నిజానికి కార్డియోమెటబాలిక్ వ్యాధులు గుండె, జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటాయి. వీటి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు కాఫీని రోజు మొత్తంలో మూడు కప్పులకు మించి గానీ, అంతకంటే ఎక్కువసార్లు గానీ తీసుకుంటే ఈ సమస్యలు మరింత అధికం అవుతాయి. అదే రోజూ ఒకటి లేదా మూడు కప్పుల వరకు మాత్రమే కాఫీ తాగే వారిలో మాత్రం రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే పాలలో కాఫీ పొడి కలిపి తీసుకునే కాఫీకంటే మిల్క్ లేకుండా వేడినీళ్లల్లో కాఫీ పొడి కలుపుకొని తాగే బ్లాక్ కాఫీ ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు.

గత అధ్యయనాలు కూడా కాఫీవల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాయి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు 2010లో 88 వేలమందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజుకూ మూడు కప్పుల వరకు కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 23-50% తగ్గించిందని కనుగొన్నారు. 2015లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుడు డాక్టర్ జేమ్స్ డి ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకులు 47 వేలమంది పెద్దలపై జరిపిన అధ్యయనం ప్రకారం కూడా తక్కువమొత్తంలో కాఫీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని తేలింది.

పరిశోధకుడు డాక్టర్ జుస్సీ కౌహనెన్ నేతృత్వంలోని పరిశోధకులు 37 వేలమందిపై నిర్వహించిన స్టడీ ప్రకారం.. రోజుకూ 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20-30% తగ్గించినట్లు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు 185 వేలమంది పెద్దలపై నిర్వహించిన అధ్యయం ప్రకారం మితమైన కాఫీ వినియోగం గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తున్నట్లు కనుగొన్నారు. సో.. కాఫీ లవర్స్ ఎంచక్కా తమ ఫేవర్ డ్రింక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అయితే రోజుకూ 3 కప్పులకు మించితే మాత్రం రిస్క్‌లో పడతారు జాగ్రత్త !

Read More ...

చికెన్, మటన్ ఎక్కువగా తినేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!






Tags:    

Similar News