సరికొత్త రియాలిటీ షో... మగాళ్ల మధ్య శృంగార సంబంధాలను పూర్తిగా అర్థం చేయిస్తుందట.. ఆ సీన్స్ కూడా...

సాధారణంగా రియాలిటీ షో అంటే బిగ్ బాస్ గుర్తొస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో ఈ తరహాలో వచ్చిన 'లవ్ ఐలాండ్', 'లవ్ ఈజ్ బ్లైండ్' వంటి కార్యక్రమాలు ఫుల్ రేటింగ్ తో దూసుకుపోయాయి. అయితే ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులు ఇద్దరినీ హౌజ్ లేదా బీచ్ హౌజ్ లో బంధించి వారి మధ్య జరిగే చర్చలు, గొడవలు, ప్రేమల గురుంచి చూపించినవే.

Update: 2024-09-24 17:43 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా రియాలిటీ షో అంటే బిగ్ బాస్ గుర్తొస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో ఈ తరహాలో వచ్చిన 'లవ్ ఐలాండ్', 'లవ్ ఈజ్ బ్లైండ్' వంటి కార్యక్రమాలు ఫుల్ రేటింగ్ తో దూసుకుపోయాయి. అయితే ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులు ఇద్దరినీ హౌజ్ లేదా బీచ్ హౌజ్ లో బంధించి వారి మధ్య జరిగే చర్చలు, గొడవలు, ప్రేమల గురుంచి చూపించినవే. కానీ జపాన్ సరికొత్త షో మాత్రం కేవలం పురుషులను మాత్రమే హౌజ్ లోకి పంపించి... వారి బంధాలు, స్నేహాలు, శృంగార భావాల గురించి ప్రసారం చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతున్న ఈ షో స్వలింగ సంపర్కుల ఎమోషన్స్ హైలెట్ చేస్తుంది. ఇలాంటి బంధాలను నార్మలైజ్ చేసేందుకు కృషి చేస్తుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన పది ఎపిసోడ్స్ ప్రసారం కాగా ఇంటర్నేషనల్ మీడియా ప్రశంసలు కురిపించింది. ఆరోగ్యకరమైన, పవిత్రమైన షోగా అభివర్ణించింది. అయితే జపాన్ లో ఇలాంటి కల్చర్ కు పూర్తిగా వ్యతిరేకత ఉండగా .. స్వలింగ సంపార్కలను నార్మలైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ షో. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే "ది బాయ్‌ఫ్రెండ్స్" నిర్మాతలు హౌస్‌మేట్స్‌లో జాతి వైవిధ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. కొరియన్, తైవానీస్ కుటుంబ మూలాలకు చెందిన పురుషులను కాస్టింగ్ చేయడం ద్వారా షోను ఇంట్రెస్టింగ్ గా మలిచేశారు. కాగా అక్కడ కొరియన్, తైవానీస్ మధ్య వైరం ఉంటుందని తెలుస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇలా డిజైన్ చేశారని టాక్. తమ ఫోకస్ కేవలం మగాళ్ల మధ్య శృంగారంపై మాత్రమే కాదని.. కలిసి సమయాన్ని గడపడం, వ్యక్తిగత వృద్ధిని అనుభవించడంపై కూడా ఉందని తెలిపారు నిర్మాతలు.

Tags:    

Similar News