పుచ్చకాయను కోయకుండానే తియ్యగా ఉందో? లేదో ? ఇట్టే కనిపెట్టొచ్చు. ఎలాగో తెలుసా?

అందరూ పుచ్చకాయను ఎంతో ఇష్టంగా తింటారు.

Update: 2025-03-18 13:30 GMT
పుచ్చకాయను కోయకుండానే తియ్యగా ఉందో? లేదో ? ఇట్టే కనిపెట్టొచ్చు. ఎలాగో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలం వచ్చేసింది. అందరూ పుచ్చకాయను (  watermelon)  ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే, ఇది మార్కెట్‌లో చాలా చౌకగాదొరుకుతుంది. అలాగే, ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. అందుకే, ఎంతో మంది దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ప్రస్తుతం ఎక్కడ చూసిన నకిలీనే నడుస్తుంది. తినే ఫుడ్ నుంచి తాగే నీరు వరకు మొత్తం కల్తీనే ఉంది. దీని వలన ఏది నాణ్యతమైనదో? ఏది చెడ్డదో తెలుసుకోవడం మనుషులకు చాలా కష్టంగా మారింది.

పుచ్చకాయలో 95% పైగా నీరు ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇది తీసుకుంటే.. మన శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.. ఈ సమయంలో చలువ చేసే ఆహారాలను తీసుకోవాలి.

దీని వలన వడదెబ్బ తగలకుండా ఉంటుంది. పుచ్చకాయలు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి. చాలా మంది ఇంటికి తీసుకెళ్లి .. రెండు, మూడు రోజుల తర్వాత కట్ చేసి తింటారు. అయితే, పుచ్చకాయను కట్ చేయకుండానే అది పండిందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

కాడ భాగం : పుచ్చకాయను తినే ముందు, ముందుగా కాడ భాగాన్ని ఒకసారి చూడాలి. అక్కడ, బాగా మాడిపోయి నల్లగా ఉంటే అది పండిందని అర్థం. పూర్తిగా.. పండని పుచ్చకాయలో ఈ స్పాట్స్ పెద్దగా కనబడవు. అందుకే, మీరెప్పుడైనా పుచ్చకాయను కొనేటప్పుడు కాడను చూసి కొనాలి.

గీతలు, మచ్చలు: పుచ్చకాయ బయట వైపు పచ్చ రంగు గీతలు, చిన్న చిన్న మచ్చలు ఉంటే, అది బాగా పండినదని గ్రహించండి.

పుచ్చకాయ సైజు: పుచ్చకాయలు మీద షుగర్ స్పాట్స్‌ ఉంటే పండినది అర్ధం. అంతేకాకుండా, బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని పాటించి, పుచ్చకాయను కట్ చేయకుండానే .. ఇలా పండిందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News