చిన్నతనంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. పెద్దయ్యాక ఈ 7 ప్రవర్తనలను ప్రదర్శిస్తారు!
తల్లిదండ్రుల్ని పిల్లల పట్ల ఎంత ప్రేమగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రుల్ని పిల్లల పట్ల ఎంత ప్రేమగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పిల్లలపై లవ్‌తో చిన్న పని చెప్పడానికి కూడా సంకోచిస్తుంటారు. కానీ వాస్తవానికి పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు చెప్పాలి. లేకపోతే పెద్దయ్యాక వారు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే చిన్నతనంలో తమను తాము ప్రేమించుకోవడం నేర్పించని మహిళలు పెద్దయ్యాక ఈ 8 ప్రవర్తనలను ప్రదర్శిస్తారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతరులను సంతోషపెట్టడంలో ముందుంటారు. ఏ విషయానికి కూడా నో చెప్పలేరు. కానీ వారిలో వారు సఫర్ అవుతుంటారు. వీరు నిరంతరం ఇతరులకే ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తుంటారు. అలాగే వారు తమ సొంత విజయాలను తక్కువ అంచనా వేస్తారు.
పొగడ్తలకు దూరంగా ఉంటారు. వారు గుర్తింపును ఆశించడం లేదని కాదు.. వాస్తవానికి వారు దానికి అర్హులని నమ్మరు. అలాగే ఎవరైనా మీ టెక్ట్స్ కు వెంటనే స్పందించకపోతే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. దీనినే మనస్తత్వవేత్తలు ఆకస్మిక ఆత్మగౌరవం అని పిలుస్తారు.
అలాగే వారు గొడవలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాల్ని దాచుకుంటారు. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. వీటితో పాటుగా ప్రతిదానికీ అతిగా క్షమాపణలు చెబుతారు. ఇతరులను పూర్తిగా విశ్వసించలేరు. అలాగే జనాలకు దూరంగా ఉంటారు. అవకాశాలను స్వయంగా నాశనం చేసుకుంటారు. అద్భుతమైన కెరీర్ అవకాశం లభించినప్పటికీ.. నేను అర్హున్ని కాదని అనుకుంటారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read Also..
Water: వేసవి కాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?