మనుషుల్లా డాల్ఫిన్స్ కూడా పేర్లు పెట్టుకుంటాయి.. అవి ఇలా..?!
జంతువుల్లో కనుగొనడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. Dolphins too use signature whistles to represent other dolphins.
దిశ, వెబ్‌డెస్క్ః మనుషులు తమ గుర్తింపును పేర్లతో పెట్టుకుంటారు. ఆ గుర్తింపుతో పిలుచుకుంటారు. పేరు విన్నప్పుడే మీ స్నేహితుడి ముఖం చిత్రించుకుంటారు. అలాగే, కొందరు తమ స్నేహితులను వారు వాడే పెర్ఫ్యూమ్ వాసన బట్టి గుర్తిస్తారు. ఇలా, మానవులు ఇంద్రియ జ్ఞానాలను ఉపయోగించి ఒకరికొకరు గుర్తించడం మనకు తెలుసు. సరిగ్గా, ఇలాగే డాల్ఫిన్లు కూడా వాటి సహచరులను గుర్తించడానికి నిర్దిష్ట సిగ్నేచర్‌లను గుర్తింపుగా ఎంచుకున్నాయి. అవే విజిల్స్ (ఈల శబ్ధం). డాల్ఫిన్‌లు తరచుగా వాటి స్వంత విజిళ్ల శబ్ధంతో ఇతర డాల్ఫిన్లను పలకరిస్తాయి. అయితే, ఒక డాల్ఫిన్ తనకు తెలిసిన డాల్ఫిన్ విజిల్‌ను విన్నప్పుడు, అవి పిలుస్తున్న డాల్ఫిన్‌ని చురుకుగా చిత్రీకరించ గలవో లేదో పరిశోధకులకు ఇంకా తెలియదు.. ఆస్టిన్ స్టేట్ యూనివర్శిటీలోని జీవశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న జాసన్ బ్రూక్, ఆయన సహోద్యోగులు విన్సెంట్ జానిక్, సామ్ వాల్మ్సే కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. డాల్ఫిన్‌లు వాసన చూడలేవు కనుక, అవి సముద్రంలో ఒకదానికొకటి గుర్తించడానికి ప్రధానంగా ఈలలపై ఆధారపడతాయని తేల్చారు. డాల్ఫిన్‌లు ఒకదానికొకటి సంబోధించుకునే మార్గంగా మరొక డాల్ఫిన్ ఈలలను కూడా కాపీ చేస్తాయని స్టడీలో అర్థం చేసుకున్నారు. ఇక మనుషుల్లాంటి ఈ ప్రవర్తన, ఈ రకమైన ప్రాతినిధ్య నామకరణం మనుషుల్లో కాకుండా ఇతర జంతువుల్లో కనుగొనడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు పేర్కొన్నారు.