Money plant: మనీ ప్లాంట్‌తో అనారోగ్య సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
మనీ ప్లాంట్ ఆకుల (Money plant leaves) ప్రయోజనాలు కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen production)ని కలిగి ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: మనీ ప్లాంట్ ఆకుల (Money plant leaves) ప్రయోజనాలు కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen production)ని కలిగి ఉంటాయి. పగటిపూట అవి కార్బన్ డయాక్సైడ్ (Carbon dioxide) ను ఆక్సిజన్‌గా మార్చడంలో మేలు చేస్తాయి. కాగా చాలా మంది ఇల్లు లేదా కార్యాలయంలో మనీ ప్లాంట్‌ను పెట్టుకుంటారు.
ఇది ఆక్సిజన్ స్థాయిలు (Oxygen levels) పెరగడం మెదడు కార్యకలాపాలు(Brain activity).. అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. మనీ ప్లాంట్ గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని(Attracts positive energy) నమ్ముతారు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మారుస్తుంది. అలాగే అభివృద్ధికి చిహ్నంగా భావిస్తారు.
మీ జీవితంలో సానుకూల మార్పులకు సూచనగా నిలుస్తుంది. మనీ ప్లాంట్లు ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతాయి. మానసిక ప్రశాంతత(Peace of mind)ను కలిగిస్తాయి. వీటితో పాటుగా మనీ ప్లాంట్లు ఇంట్లోని అందాన్ని పెంచుతాయి. ఈ అందమైన ఆకుపచ్చ మొక్కలు మనీ ప్లాంట్లు నీటిలో పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మనీ ప్లాంట్‌తో పలు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ధనం వృద్ధి చెందడం కోసం పెంచుకునే మనీ ప్లాంట్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. గాజు సీసాలో మనీ ప్లాంట్‌ను పెంచేవారు వాటిలో వాటర్ ను ఎప్పటికప్పుడు ఛేంజ్ చేయలి. లేదంటే ఈ వాటర్‌లో డెంగ్యూ దోమలు (Dengue mosquitoes) అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా పడక గదిలో లేదా నిద్రించే ప్రాంతాలకు దగ్గర పెట్టుకకుండా బయటపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More..