Ramadan fasting: రంజాన్ ఉపవాసంలో ఏ ఖర్జూరం తింటే మేలు..?

ఖర్జూరాన్ని (dates) రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతూనే ఉంటారు.

Update: 2025-03-16 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖర్జూరాన్ని (dates) రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం (Magnesium), పొటాషియం (Potassium), విటమిన్ బి-6 దట్టంగా ఉన్నాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ (Iron content) పెరగడం నుంచి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు, ఖర్జూరాలు అనేక ముఖ్యమైన లాభాల్ని అందిస్తాయి.

ఖర్జూరం (Date Palm fruit) తింటే రోగనిరోధక శక్తి పెరుగటమే కాకుండా.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది(Digestion improves). మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనత (anemia), గర్భం ధరించిన సమయంలో వచ్చే కష్టాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఖర్జూరం తింటే దగ్గు, జలుబు (cold) నుంచి ఉపశమనం కలుగుతుంది. ఖర్జూరం తక్కువ రక్తపోటు ఉన్నవారికి మేలు చేస్తాయి.

ఇక రంజాన్‌ సమయంలో ఖర్జూరాలను ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. దీని కారణం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (Prophet Hazrat Muhammad) ఖర్జూర పండ్లను చాలా ఇష్టపడేవాడట. దీంతో ఆయన ఉపవాసం ముగించే సమయంలో ఖర్జురాలను తినేవారని అంటుంటారు. అంటే ఆయన ఖర్జూరాలు తిని ఉపవాసం ముగించేవారు. మరీ రంజాన్ ఉపవాసంలో పండిన ఖర్జూరలను తింటారు. ఈ ఖర్జూరాలు రక్తంలో చక్కెర స్థాయిల్ని (Sugar levels) కూడా నియంత్రిస్తాయి. ఉపవాసానికి ఈ ఖర్జూరాలు ఉత్తమమైనవి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

READ MORE ...

భోజనం త్వరగా జీర్ణం అవ్వడానికి రాత్రి భోజనం తర్వాత చేయాల్సిన 6 పనులు..?


Tags:    

Similar News