భోజనం త్వరగా జీర్ణం అవ్వడానికి రాత్రి భోజనం తర్వాత చేయాల్సిన 6 పనులు..?
భోజనం తర్వాత నడవడం, నీరు సరిగ్గా తాగడం, ఒత్తిడి నిర్వహణ వంటి అలవాట్లను అనుసరించడం వల్ల సాధారణ జీర్ణ సమస్యల్ని (Digestive problems) నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భోజనం తర్వాత నడవడం, నీరు సరిగ్గా తాగడం, ఒత్తిడి నిర్వహణ వంటి అలవాట్లను అనుసరించడం వల్ల సాధారణ జీర్ణ సమస్యల్ని (Digestive problems) నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతులు సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. అలాగే పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. వీటితో పాటుగా పేగు ఆరోగ్యాన్ని (Gut health) కాపాడటమే కాకుండా.. ఇది దీర్ఘకాలిక జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత మీ పొట్ట టైట్ గా అనిపిస్తే కనుక.. ఈ టిప్స్ పాటించండి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడతాయి.
15 నిమిషాలు నడవండి..
రాత్రి తిన్న తర్వాత 15 నిమిషాల పాటు మెల్లగా నడవడం వల్ల జీర్ణక్రియ గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ తేలికపాటి శారీరక శ్రమ పేగు కండరాలను ప్రేరేపిస్తుంది కూడా. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది (Reduces stomach bloating.). భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కాగా వాకింగ్ (walking) తప్పని అంటున్నారు నిపుణులు.
నీళ్లు సరిగ్గా తాగండి
జీర్ణ ప్రక్రియలో ఆహారాన్ని చిన్న కణాలుగా విడగొట్టడం.. జీర్ణవ్యవస్థ సజావుగా కదలికను సులభతరం చేయడానికి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కాగా భోజనానికి ముందు ఒక గ్లాసు, తర్వాత మరొక గ్లాసు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజంతా తప్పకుండా 5 లీటర్ల వాటర్ తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.
త్వరగా భోజనం చేయండి..
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల నిద్రలేమి సమస్యలు (Insomnia problems) తలెత్తుతాయి. కాగా నిద్రవేళకు రెండు నుంచి మూడు గంటల ముందు భోజనం చేయడం మంచిది. అలాగే ఆహారాన్ని సరిగ్గా నమలండి. ఈ విధానం ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టి జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నిండిన భావన సంకేతాలను బాగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.
జీర్ణక్రియకు సహజ నివారణలు ప్రయత్నించండి..
భోజనం తర్వాత జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహజ జీర్ణ సహాయకాలు సహాయపడతాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. వికారం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు జీర్ణ కండరాలను సడలించడం ద్వారా ఉబ్బరం, వాయువును తగ్గించడంలో మేలు చేస్తాయి. మెంతులు భోజనం తర్వాత తినవచ్చు. మరియు కడుపుకు ఉపశమనం కలిగించే ప్రభావాల కోసం పిప్పరమెంటు టీని సిప్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోండి..
జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే ఒత్తిడి (stress) నిర్వహణ చాలా అవసరం. అధిక ఒత్తిడి స్థాయిలు కార్టిసాల్‌ను విడుదల చేస్తాయి. ఇది సాధారణ జీర్ణక్రియకు అంతరాయం కలిగించి ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. కాగా లోతైన శ్వాస వ్యాయామాలు (Breathing exercises), ధ్యానం ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తాయి. రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, మంచంపై ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వంటి వాటికి బదులు.. మరుసటి రోజు కోసం ప్రణాళిక వేసుకోవడం బెటర్.
ఈ జీర్ణ ఆరోగ్య పద్ధతులను నిరంతరం పాటించడం వల్ల పేగు పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ అసౌకర్యం (Digestive discomfort) తగ్గుతుంది. ఈ అలవాట్లపై క్రమం తప్పకుండా శ్రద్ధ వహించడం వల్ల దీర్ఘకాలిక జీర్ణ ఆరోగ్యానికి (Long-term digestive health) తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More..