Health: ఒక్క రోజు నిద్రపోకపోయినా చాలా డేంజర్ బ్రో.. అధ్యయనంలో ఏం తేలిందంటే?

Update: 2025-03-16 09:45 GMT

దిశ, వెబ్ డెస్క్: నేటి ఉరుకుల, పరుగుల బిజీ లైఫ్‌లో (Busy life చాలా మంది సరిగా నిద్రపోవటం లేదు. పైగా పని ఒత్తిడీ, వీకెండ్ పార్టీలు అనే సాకులతో నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. అయితే, ఒక్కరోజు నిద్రపోకపోయినా కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. కువైట్‌లోని డాస్‌మేన్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Dasman Diabetes Institute) పరిశోధకులు విశ్రాంతికీ, దీర్ఘకాలిక వ్యాధులకూ ఉండే సంబంధంపైన అధ్యయనం చేశారు.

ఈ నివేదిక ప్రకారం.. మనం నిద్ర (Sleep) పోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామేమో అనుకుంటుందని పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా దాన్ని తగ్గించడానికి కార్టిసాల్‌ అనే హార్మోన్‌ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుందని తెలిపారు. అయితే, ఒక్కరోజే కదా ఏముంది అని అనుకుంటే పెద్ద ప్రమాదంగా మారుతుందని వివరించారు. ఇలా ఒక్కరోజూ అనుకుంటూ పదేపదే నిద్రకు దూరమవుతుండటంతో శరీరంలో కార్టిసాల్‌ ఎక్కువగా జమవుతుందని, చివరికి శరీరంలో కొన్ని వాపులకి కారణం అవుతుందని వెల్లడించారు.

అలాగే, నిద్రలేమితో బాధపడే వారిలో కణాలు శక్తిని కోల్పోయి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని కోల్పోతాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని, దీంతో శరీరం మోనోకైట్స్‌ అనే వ్యాధినిరోధక కణాలని విడుదల చేస్తుంది. ఈ పరిస్థితీ పదే పదే కొనసాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతూ వచ్చి ఊబకాయం, గుండెజబ్బులతోపాటూ ఇతర దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 

Read More..

10 రోజులు వాటర్ బెడ్ రెస్ట్‌ తీసుకుంటే.. రూ.4.7 లక్షల జీతం 

Tags:    

Similar News