Gourd Benefits : పొట్లకాయతో హెల్త్ బెనిఫిట్స్.. ఇవి తెలిస్తే తినకుండా ఉండలేరు!

Gourd Benefits : పొట్లకాయతో హెల్త్ బెనిఫిట్స్.. ఇవి తెలిస్తే తినకుండా ఉండలేరు!

Update: 2024-10-25 11:02 GMT

దిశ, ఫీచర్స్ : పొట్లకాయ.. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఈ కూరగాయ ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. అయితే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి తరచుగా తీసుకునే వారిలో మధుమేహం ప్రభావం తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుడటం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్ కంటెంట్‌కు మూలం కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. లివర్, మూత్ర పిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి రాకుండా నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.  

Tags:    

Similar News