నువ్వు గెలవలేవు అంటున్నారా.. ఇలా చేస్తే విజయం నీదే

ఈ సమాజం గెలిచినవారు ఏమి చెప్పిన వింటుంది. వారికి సపోర్టు చేస్తుంది. గెలిచినోడి మాటకు ఉన్న విలువ ఓడినవాడి కష్టానికి లేదు. ఒక్కసారి ఓడిపోతే చాలు జీవితంలో ఏది సాధించలేవు. నీతో ఏ పని కాదు అంటు మానసికంగా ఇబ్బంది

Update: 2024-01-20 08:16 GMT

దిశ, ఫీచర్స్ : ఈ సమాజం గెలిచినవారు ఏమి చెప్పిన వింటుంది. వారికి సపోర్టు చేస్తుంది. గెలిచినోడి మాటకు ఉన్న విలువ ఓడినవాడి కష్టానికి లేదు. ఒక్కసారి ఓడిపోతే చాలు జీవితంలో ఏది సాధించలేవు. నీతో ఏ పని కాదు అంటు మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. నువ్వు చేసే ప్రతి పనికి అడ్డుపడటమే కాకుండా, నేను నిజంగానే ఏమీ సాధించలేనేమో అనే విధంగా నిన్ను మార్చుతారు. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి ఒక్క అడగు ముందుకు వేసినప్పుడే విజయం నిన్ను వరిస్తుంది.ప్రతి మనిషికి జీవితంలో ఏదో సాధించాలనే కల, తపన ఉంటుంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. వాటి వలన అక్కడే ఆగిపోకూడదంట. కళ్లు మూసుకొని నీ కలను గుర్తు తెచ్చుకొని ఆటు పోట్లను దాటుకొని విజయం వైపు పయనించాలంట. అప్పుడే గెలుపు నిన్ను వరిస్తుంది.

సామర్థ్యం ఉన్న సైనికుడికే బలమైన యుద్దాలు ఎదురు అవుతాయి. అలానే నీవు చేయగలవు కాబట్టే నిన్ను ప్రతి కష్టం వెంటాడుతుంది. కన్నీళ్లను దాటడం నేర్చుకుంటనే సగం జీవితం అర్థం అవుతుంది. అలా ప్రతీ సమస్యను దాటుకున్నప్పుడే నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు. పక్కవారి మాటలను, అవమానాలను పట్టించుకోకుండా నీ పని నువ్వు చేస్తే ఓ గొప్ప గెలుపు నిన్ను చేరుతుంది.అలా నువ్వు గెలవలేవు అంటున్నవారే నీకు సలాం కొట్టే రోజు వస్తుంది.

Tags:    

Similar News