Air conditioner : వేసవిలో ఏసీలు కూడా పేలొచ్చు..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
Air conditioner : వేసవిలో ఏసీలు కూడా పేలొచ్చు..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్ : అసలే సమ్మర్.. ఎండలు మండుతున్నాయ్.. ఉక్కబోతలతో పలువురు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కోసం చాలా మంది తమ ఇండ్లల్లో, ఆఫీసుల్లో ఏసీ వాడుతుంటారు. ఆఫీసుల్లో అయితే టెక్నీషియన్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి ఏసీలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరిస్తారు. కానీ ఇండ్లల్లో అలా కాదు. ఏసీలో వెంటనే ప్రాబ్లం సాలో చేయడం కష్టం. అందుకే ఏసీ వాడేవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏసీలు కూడా పేలిపోతున్నాయ్. ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఏసీ పేలండంవల్ల ఓ వ్యక్తి మరణించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడం తెలిసిందే. అందుకే బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు.
*ఎందుకు పేలుతాయి? : సాంకేతిక లోపాలు, సాంకేతిక లోపాలు వంటివి ఏసీలు పేలడానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం వాడే ఏసీల్లో వేటికైనా సరే (Split Or Window) కంప్రెసరే మెయిన్. కాగా దీని నిర్వహణ సరిగ్గా లేకపోతే, వేడెక్కడంవల్ల పేలుడు సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అట్లనే వేసవిలో షార్ట్ సర్క్యూట్ అయ్యే చాన్సెస్ కూడా ఎక్కువే. సాంకేతిక లోపం, వైరింగ్ సరిగ్గా లేకపోవడం(Defective) వంటివి ఏసీలో మంటలు లేదా పేలుడు సంభవించడానికి కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఏసీని వాడే ముందు తప్పకుండా చెక్ చేయాలని సూచిస్తున్నారు.
*లీకేజ్, వోల్టేజ్ : వేసవిలో సాధారణంగా విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు సంభవిస్తుంటాయి. దీంతో వోల్టేజ్ స్పైక్స్ ఏసీలోని ముఖ్యమైన భాగాలను దెబ్బతీసే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు సడెన్‌గా వోల్టేజ్ పెరిగి ప్రమాదాలు సంభవించడానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏసీలు వాడే వారు వోల్టేజ్ స్టెబిలైజర్‌ను యూజ్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
*కంప్రెసర్ గ్యాస్ లీకేజ్ : ఏసీ వాడకం పెరిగినప్పుడు కంప్రెసర్‌లో గ్యాస్ లీక్ అవడం(compressor gas leakage) కూడా ఏసీలు వేడెక్కడానికి, పేలడానికి కారణం అవుతాయి. అందుకే ఆన్‌చేసినప్పుడు షీలో ఏదైనా డిఫరెంట్ స్మెల్ రావడం గానీ, రొటీన్‌కు భిన్నమైన శబ్దం గానీ వినిపించడం వంటి సంకేతాలు గుర్తిస్తే గ్యాస్ లీకేజీ ప్రాబ్లం ఉండవచ్చు. ఇది ఏసీ పేలడానికి దారితీస్తుంది. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వాలి. దీంతోపాటు ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోవడంవల్ల కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి పేలిపోయే చాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వాడే ఏసీ పాతది అయితే గనుక.. సమ్మర్‌లో వాడకానికి ముందు సర్వీసింగ్ చేయించాలంటున్నారు నిపుణులు. రెగ్యులర్‌గా చెక్ చేయడం, సర్వీసింగ్ చేయించడం, వోల్టేజ్ స్టెబిలైజర్లు వాడటం, ఏదైనా శబ్దం, వైర్ కాలుతున్నట్లు వాసన వంటివి వస్తే అలర్ట్ అవ్వడం వల్ల ఏసీలు పేలకుండా జాగ్రత్త పడవచ్చు.