Red Banana : 21 రోజుల పాటు రెడ్ బనానా తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
వాటిలో రెడ్ బనానా తింటే ఎక్కువ లాభాలున్నాయని పోషకాహార నిపుణులు తెలిపారు.
దిశ,వెబ్ డెస్క్: అరటిపండు.. ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అరటి పండ్లలో అనేక రకాలు ఉంటాయి. అయితే, వాటిలో రెడ్ బనానా తింటే ఎక్కువ లాభాలున్నాయని పోషకాహార నిపుణులు తెలిపారు. ఇది మామూలు అరటిపండ్ల కంటే చాలా తియ్యగా ఉంటుంది. కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. ఈ రెడ్ బనానా ని 21 రోజులు తీసుకుంటే మన శరీరంలో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చర్మ సమస్యలు
మనలో కొంత మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. డ్రై స్కిన్, దద్దుర్లు, చర్మం ఎర్రబడడం, సోరియాసిస్ వంటి ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. దీనిని పైపూతగా అప్లై చేయడం వల్ల సోరియాసిస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కంటి చూపు
ఈ రోజుల్లో చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు దృష్ఠి లోపం వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. ఇక వృద్ధాప్యంలోనూ కంటిశుక్లాల వంటి సమస్య వస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగ్గా మారేందుకు మార్ష్‌మల్లౌ తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
సంతానలేమి
చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడతారు. ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటారు. అలాంటి వారు, రెగ్యులర్‌గా ఈ రెడ్ బనానా ని తీసుకుంటే.. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా మారి సంతానోత్పత్తి పెరుగుతుంది. అంగస్తంభన సమస్య కూడా దూరమవుతుంది.
నీరసం
ఎండలో 5 నిముషాలు నిలబడగానే కళ్లు తిరిగి పడి పోతారు. అలాంటి వారు మీ రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకుంటే.. ఎందుకంటే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి నాడీ వ్యవస్థని బలంగా చేసి ట్యాక్సిన్స్‌ని డీటాక్సీఫై చేస్తాయి. నరాల సమస్యలతో బాధపడేవారు ఈ పండు తింటే సమస్య తగ్గుతుంది.