Summer Drinks: ఈ ఐదు జ్యూసులు తాగండి.. ఒంట్లో వేడి పరార్ అవ్వాల్సిందే...?

ఎండాకాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి.

Update: 2025-03-14 16:45 GMT
Summer Drinks: ఈ ఐదు జ్యూసులు తాగండి.. ఒంట్లో వేడి పరార్ అవ్వాల్సిందే...?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎండాకాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మండే ఎండల వల్ల చెమట ఎక్కువగా బయటకు వస్తుంది. తద్వారా బాడీలో నీటి శాతం తగ్గిపోతుంది. సమ్మర్‌లో బాడీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ తలెత్తుతుంది. నీరసం, వడదెబ్బ వంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి.

ఒకవేళ బాడీ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్కిన్‌పై దద్దుర్లు రావడం, పింపుల్స్, తలనొప్పి, రక్తపోటు, కళ్లు తిరగడం, హార్ట్ బీట్ స్పీడ్ పెరగడం వంటివి వస్తాయి. కాగా ఎండల నుంచి తప్పించుకోవడానికి సమ్మర్‌లో ఈ ఐదు డ్రింక్స్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ మీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సమ్మర్‌లో తల తిరిగితే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. లెమన్ జ్యూస్ తయారు చేసేటప్పుడు అందులో కాస్త సాల్ట్ వేయాలి. ఉప్పు శక్తిని ఇస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వేసవిలో బాడిని చల్లగా ఉంచడానికి మేలు చేస్తాయి. కావాలంటే లెమన్‌లో అల్లం, పుదీనా వంటివి వేసుకోవచ్చు.

అలాగే బొప్పాయి జ్యూస్ తాగితే వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. వీటితో పాటుగా తులసి జ్యూస్ చలికాలమే కాదు.. సమ్మర్‌లో కూడా మేలు చేస్తుంది. అలాగే జలుబు సమస్యల్ని తరిమికొడుతోంది. చెరుకు రసం కూడా ఎండ నుంచి కాపాడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి.

చెరకు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వేసవి కాలంలో పండ్ల రసాలు తాగితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వేడిని కూడా తగ్గించడంలో మేలు చేస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More..

ఒక్క గ్లాస్ చెరకు రసంతో ఎన్ని మంచి ఫలితాలో తెలుసా..?


Tags:    

Similar News