married women : లేటెస్ట్ సర్వే.. పెళ్లైన మహిళలు గూగుల్‌లో సీక్రెట్‌గా ఏం వెతుకుతున్నారో తెలుసా?
ఒకప్పుడు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ, ప్రతి విషయం తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు.
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ, ప్రతి విషయం తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. అయితే తాజాగా కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారు అని సర్వే చేయగా అందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కొత్త జీవితానికి అలవాటు పడాలంటే కాస్త టైమ్ పడుతూనే ఉంటుంది. కొన్నింటికి అలవాటు కావాలంటే, ఇంకొన్నింటిని నేర్చుకోవాలి. అయితే కొత్తగా పెళ్లైన వారు తమకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ గూగుల్ యూస్ చేస్తున్నారంట. అంతే కాకుండా గూగుల్‌లో చిత్ర విచిత్రమైన ప్రశ్నలు సెర్చ్ చేస్తుతున్నారంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగాపెళ్లైన తర్వాత చాలా మంది మహిళలు ప్రతి చిన్న విషయాన్ని కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నారంట. చాలా మంది పిల్లలు పుట్టడం గురించి సెర్చ్ చేస్తున్నారంట. పిల్లలను కనడానికి సరైన వయసు ఏది? సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలు. ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి?, పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎలా ఉండాలి , ఉండకూడదు.అత్తమామలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? భర్తకు నచ్చేలా ఎలా వంటలు చేయాలి? భర్తను బానిస చేయడం ఎలా? భర్తతో ఆనందంగా గడపడానికి ఏ ప్రదేశాలు బెస్ట్? డబ్బును ఆదా చేయడం ఎలా? భర్తకు మన మీద ప్రేమ ఉందని ఎలా తెలుసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.