వయస్సులో ఉండికూడా సెక్స్ చేయలేకపోతున్నారట.. కారణం ఏంటంటే..?

సెక్సువల్ థాట్స్ సాధారణంగా యువతలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొనేందుకు అత్యంత ఆసక్తి చూపుతుంటారు.

Update: 2023-08-21 05:56 GMT

దిశ, ఫీచర్స్: సెక్సువల్ థాట్స్ సాధారణంగా యువతలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొనేందుకు అత్యంత ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆ పరిస్థితి మారుతోందని ఇండియానా యూనివర్సిటీకి చెందిన కింజీ ఇన్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా యువజంటల్లో ఈ ధోరణి పెరుగుతోంది. ఒకప్పుడు మ్యారేజ్ అయిన 10 నుంచి 15 ఏళ్లకు లైంగిక కోరికలు తగ్గేవని, ప్రజెంట్ ఐదేళ్లకే యువతలో ఆ పరిస్థితి కనిపిస్తోంని సెక్స్ థెరపిస్టులు అంటున్నారు. 30 ఏళ్ల క్రితం అయితే 50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా సెక్స్ కోరికలు తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. కానీ ప్రజెంట్ మిలీనియల్స్(1980 -1990), జెనరేషన్ Z (1990 - 2010) కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

సర్వే ప్రకారం గత ఐదేళ్లలో మిలీనియల్స్‌ 25. 8 శాతం మంది సెక్స్‌పట్ల ఇంట్రెస్ట్ కోల్పోయారు. జనరేషన్ Z లో 10.5 శాతం జంటలు పెళ్లయిన ఐదేళ్లకే శృంగారంపట్ల ఆసక్తి కోల్పోతున్నాయి. పెళ్లయిన వారు ఏడాదికి పదికంటే తక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడాన్ని నిపుణులు ‘సెక్స్ లెస్ మ్యారేజెస్‌’గా నిర్వచిస్తున్నారు. శృంగార కోరికలు తగ్గడానికి ఒత్తిడితోపాటు వివిధ కారణాలు ఉంటున్నాయని సర్వేను ఎనలైజ్ చేసిన పరిశోధకులు చెప్తున్నారు. కపుల్స్‌లో ఒకరు చొరవ తీసుకున్నప్పుడు భాగస్వామి తిరస్కరిస్తూ రావడంవల్ల కొంతకాలనాకి ఆసక్తి తగ్గుతుందని, ఇష్టంలేని వ్యక్తితో పెళ్లయినా ఇలాగే జరుగుతుందని కాలిఫోర్నియాకు చెందిన సెక్స్ థెరపిస్ట్ క్రిస్టీన్ లోజానో అంటున్నారు. దీంతోపాటు వైద్యపరమైన, మానసిక కారణాలు కూడా ఉంటున్నాయి. బిజీ లైఫ్ షెడ్యూల్, మెంటల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, తరచూ టెన్షన్‌కు గురయ్యే పరిస్థితులు సెక్స్ కోరికలు తగ్గడానికి దారితీస్తున్నాయి.

30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో అయితే 61 శాతం మంది తమ చిన్న పిల్లలను చూసుకునే ఆలోచనలతోనే ఎక్కువ సతమతం అవుతుండటంవల్ల తరచూ సెక్స్‌లో పాల్గొనే అవకాశాలు తగ్గుతున్నాయని బ్రిటన్ కౌన్సెలింగ్ నెట్‌వర్క్ సర్వే వెల్లడించింది. మరో 31 శాతం మందిలో పిల్లలు పుట్టాక లైంగిక కోరికలు తగ్గుతున్నాయట. మిలీనియల్స్‌లలో అయితే కెరీర్‌లో సక్సెస్ సాధించాలని, ఫైనాన్షియల్‌గా ఎదగాలనే ఆలోచనలతో కూడిన ఒత్తిడి కోరికలు తగ్గడానికి దారితీస్తోంది. ముఖ్యంగా 38 శాతం మందిలో మానసిక ఒత్తిడి మాత్రమే సెక్స్ కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం కాగా, ఇందులో పురుషులు 36 శాతం, మహిళలు 41 శాతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది వారి సెక్సువల్ లైప్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతోంది. 

Read More:   బీ అలర్ట్: మొబైల్ కవర్‌లో డబ్బులు పెడుతున్నారా? ప్రాణాలకే ప్రమాదం..! 


Similar News