Coffee and diabets : కాఫీతో మధుమేహం..? నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
Coffee and diabets : కాఫీతో మధుమేహం..? నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
దిశ, ఫీచర్స్ : కాఫీ అధికంగా తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం, తక్కువగా తాగితే సానుకూల ప్రభావం చూపుతుందనే విషయం తెలిసిందే. అయితే రెగ్యులర్‌గా తాగేవారి రక్తంలో కెఫిన్ లెవల్స్, అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌పై కూడా అది ఎఫెక్ట్ చూపుతుందని, టైప్ 2 డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ వ్యాధుల ముప్పును కెఫిన్ లెవల్స్ డిసైడ్ చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. కెఫిన్ ఎలాంటి వ్యాధులతో ముడిపడి ఉంటుందో తెలుసుకునే ఉద్దేశంతో 2023లో 10 వేలమందిపై నిర్వహించిన జెనెటిక్ డేటాబేస్ అధ్యయన వివరాలను బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లకు పరిశోధకులు సంయుక్తంగా మరోసారి ఎనలైజ్ చేశారు.
స్టడీలో భాగంగా ఏయే జన్యువులు కెఫిన్‌తో సరిపోలుతున్నాయనే విషయాన్ని పరిశోధకులు అబ్జర్వ్ చేయగా.. ఎక్కువ మొత్తంలో కాఫీ తాగేవారి బాడీలోని కెఫిన్ లెవల్స్ టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతున్నట్లు గుర్తించారు. అంటే రోజుకు 4 కప్పులకు మించి తాగేవారిలో కాఫీలోని కెఫిన్ పదార్థం వారి గ్లూకోజ్ లెవల్స్‌ను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతు దారితీస్తుంది. దీంతో అది టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను పెంచే అవకాశం ఉంది. అలాగే రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు మితమైన కాఫీ వినియోగం టైప్ 2 మధుమేహం వచ్చే రిస్క్‌ను 23 నుంచి 50 శాతం తగ్గించగలదని ఈ సందర్భంగా పరిశోధకులు వెల్లడించారు. మొత్తానికి కాఫీ ఎక్కువైతే హానికరం.. తక్కువైతే ఆరోగ్యకరం అనేది పరిశోధకులు తేల్చారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.