Career and love : ఏమీ తోచక ఇబ్బందులు..! లవ్ అండ్ కెరీర్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక కన్‌ఫ్యూజన్!!
Career and love : ఏమీ తోచక ఇబ్బందులు..! లవ్ అండ్ కెరీర్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక కన్‌ఫ్యూజన్!!
దిశ, పీచర్స్ : ఒకప్పుడు జీవితంలో సెటిల్ అయ్యాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేవారు. కానీ ఈ జనరేషన్‌లో అలా ఉండట్లేదు. చదువుతున్న సమయంలోనే కొందరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతున్నారు. దీంతో చదువుపై కాన్సన్‌ట్రేషన్ కుదరక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు చదువుకున్నాక ఉద్యోగం సంపాదించినా ప్రేమ మీద ఏకాగ్రత ఎక్కువై, కెరీర్ మీద ఫోకస్ తక్కువై ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి లవ్ అండ్ కెరీర్ మధ్ బ్యాలెన్స్ చేసుకోలేక లైఫ్‌లో ఇబ్బందులు పడుతున్న యువతరం ఇప్పుడు పెరిగిపోతోంది. ఈ సమస్యకు కారణమేంటి? పరిష్కారమెలా? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.
గుడ్ అండ్ హెల్తీ లైఫ్ గడపాలంటే ప్రేమతోపాటు సంతోషంగా జీవించడానికి ఒక ఉద్యోగం కూడా అవసరం. అయితే వీటిమధ్య సమతుల్యతను కలిగి ఉన్నప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారని నిపుణులు అంటున్నారు. కెరీర్ మిమ్మల్ని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తే.. ప్రేమ మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. కాబట్టి ఈ రెండూ ముఖ్యమైన అంశాలే. సో.. ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, మరొక దానికి తక్కువ ప్రయారిటీ ఇస్తే హ్యాపీగా ఉండలేరు. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలని నిపుణులు సూచిస్తున్నారు.
మంచి ఫ్రెండ్స్‌లా ఉండండి..
ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే అంతకు ముందు మీరు దానిని పెంపొందించుకోవడానికి అవసరమైన ప్రవర్తన కలిగి ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం మీరు ప్రేమించే భాగస్వామితో మంచి స్నేహితులుగా మెలగాలి. కెరీర్ మీద నిర్లక్ష్యం చేయకుండానే కొంత సమయం కేటాయించాలి. పరస్పరం మాట్లాడుకోవాలి. వర్క్ బర్డెన్ ఎక్కువైనప్పుడు, వ్యక్తిగత సమస్యలు తలెత్తినప్పుడు కూడా డిస్కస్ చేసుకోవడం మీ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది.
కలిసి వాకింగ్ చేయండి
మీరు కెరీర్‌పై బాగా ఫోకస్ చేసి ఉండవచ్చు. పూర్తిగా దానిపైనే కేంద్రీకరించడంవల్ల మీ సంబంధంలో సమస్యలు తలెత్తుతుండవచ్చు. ఇది గుర్తిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ మీరు లైఫ్ అండ్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఏవో లోపాలు ఉండి ఉంటాయి. అందుకే వీలైనప్పుడల్లా భాగస్వామితో కలిసి వాకింగ్ చేయడం, సినిమాలకు వెళ్లడం, ఇద్దరూ కలిసి సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవడం మీ జీవితం, వృత్తి మధ్య సమతుల్యతకు దోహదం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
కలిసి మాట్లాడుకోవడం ముఖ్యం
మీరు పని భారంవల్ల డైలీ కలవడం, కలిసి వాకింగ్ చేయడం సాధ్యం కావడం లేదా? అయితే వీలైనప్పుడు మాత్రమే కలిసి మాట్లాడుకోండి. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించండి అంటున్నారు నిపుణులు. దీంతో మీరు మీ భాగస్వామిపట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారని అవతలి వ్యక్తి అర్థం చేసుకుంటారు. మీ వ్యక్తిగత, వృత్తి జీవితానికి మధ్య ఈ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.
ప్రతిదీ పర్సనలైజ్ చేయొద్దు
మీరు కెరీర్ పరంగా కొన్ని సమస్యల్లో ఉండవచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యలను ఇంటికి వచ్చాక వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా వాటికి సంబంధించిన అంశాలనే ఆలోచిస్తూ, వర్క్ పరంగా ఉన్న ఒత్తిడితో మీ ప్రియమైన వ్యక్తిపై కోపాన్ని ప్రదర్శించడం సమస్యలకు దారితీస్తుంది. చివరకు మీ వర్క్ అండ్ లవ్ లైఫ్ బ్యాలెన్స్ తప్పేందుకు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి.
కలిసి నిర్ణయాలు తీసుకోండి
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు వృత్తిజీవితంలో సంతోషంగా ఉండాలంటే, జీవిత నిర్ణయాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి భాగస్వామితో మీ ప్రేమ విషయాలే కాకుండా, వర్క్ పరంగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా చర్చిండం ద్వారా పరస్పరం అర్థం చేసుకుంటారు. దీంతో కెరీర్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు.
అభిప్రాయాన్ని రుద్దవద్దు
ఏ విషయంలోనూ ప్రతీ ఒక్కరి అభిప్రాయం ఒకేలా ఉండకపోచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత నిర్ణయాలను ఇతరు వ్యక్తులపై, అలాగే మీ భాగస్వామిపై బలవంతంగా రుద్దితే అక్కడ సమస్యలు ప్రారంభం అవుతాయి. దీంతో మీరు ఇటు ప్రేమ, అటు ఉద్యోగం వంటి అంశాలపై ఫోకస్ చేయలేకపోతారు. రెండింటి మధ్య సమతుల్యత సాధించాలంటే కలిసి నిర్ణయం తీసుకోవడం, పరస్పరం గౌరవించుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
సహాయం చేయండి
మీరు ఎంత బిజీగా ఉన్నా సరే.. ఏదో ఒక సమయంలో మీ భాగస్వామికి సమయం కేటాయించండి. ఆమెకు లేదా అతనికి అవసరమైతే వర్క్ లండ్ కెరీర్ పరంగా సహాయం చేయండి. అలా కాకుండా చేస్తున్న ఉద్యోగంవల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తున్నాయని గుర్తు చేయడం చివరికి మీ జీవన ఆధారం కోల్పోయేందుకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు. ఇదే కాదు, ఏ సమస్య వచ్చినా పరస్పరం చర్చించుకోవడం ఇటు లవ్ అటు కెరీర్ అంశాలకు సమానంగా ప్రయారిటీ ఇవ్వడం మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.