బీఅలర్ట్: ఉప్పు-చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్.. పర్యావరణ పరిశోధనా సంస్థ కీలక హెచ్చరిక?
ప్రతి భారతీయుల వంటకాల్లో ఉప్పు-చక్కెర అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
దిశ, ఫీచర్స్: ప్రతి భారతీయుల వంటకాల్లో ఉప్పు-చక్కెర అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఉప్పు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరాన్ని ఫిట్‌గా, హెల్తీగా ఉంచడంలో కూడా మేలు చేస్తుంది. మన బాడీకి సోడియం చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలను స్టోర్ చేయడానికి కూడా సాల్ట్ ఉపయోగపడుతుంది. ఇక చక్కెర విషయానికొస్తే.. ఉదయం లేవగానే టీ ప్రియులు ఛాయలో చక్కెర వేసుకుని తాగాల్సిందే.
స్వీట్ పదార్థాలు తయారు చేయాలన్నా షుగర్ తప్పకుండా ఉండాల్సిందే. షుగర్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. నిద్ర సమస్యకు చెక్ పెట్టడానికి చక్కెర బాదం తీసుకుంటే హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కానీ డయాబెటిస్ పెషేంట్లు చక్కెర అధికంగా తీసుకోకపోవడం బెటర్ అని అంటున్నారు నిపుణులు. అయితే ఉప్పు - చక్కెర వల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా మన భారతీయులు తరచూ ఉపయోగించే ఉప్పు-చక్కెర బ్రాండ్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉందని వెల్లడైంది. రెండ్రోజుల క్రితం సాల్ట్, షుగర్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని పర్యావరణ పరిశోధనా సంస్థ తెలిపింది. పర్యావరణ పరిశోధనా సంస్థ ‘టాక్సిక్ లింక్’ 5 చక్కెర రకాలను పది ఉప్పు రకాలను సేకరించి అధ్యయనం చేయగా.. ఈ విషయం బయటపడింది. సన్నని దారాల మాదిరి, గుండ్రంగా, థిన్ షీట్స్ రూపాల్లో 0.1 ఎమ్‌ఎమ్ నుంచి 5 ఎమ్‌ఎమ్ సైజ్‌లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్ల పర్యావరణ పరిశోధా సంస్థ పేర్కొంది. ఇండియాలోని అన్ని రకాల పెద్దా, చిన్నా సాల్ట్, షుగర్ బ్రాండ్స్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.