శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటున్నారా.. అయితే మీకు కలిగే నష్టాలివే!

Update: 2023-11-24 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్:  శృంగారం ఈ మాట వినగానే చాలా మంది తప్పుగా అనుకుంటారు. కానీ భార్య భర్తల బంధం బలపడాలంటే శృంగారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో భార్యాభర్తలు శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే మానసికంగా, శారీరకంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

కోరికలు తగ్గడం....

భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్ల క్రమంగా వారి మధ్య శృంగార వాంఛ తగ్గుముఖం పడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీని ప్రభావం ఎక్కువగా మహిళలపై ఉంటుంది.


అంగస్తంభన లోపం

మగవారు ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉండటం వల్ల అంగస్తంభన లోపం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామితో ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్ల పురుషాంగానికి రక్తప్రసరణ సరిగా జరగకపోతే అంగస్తంభన సామర్థ్యం కూడా తగ్గుతుంది. అలాగే పురుషులు ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.

యోని పొడిబారటం

స్త్రీలు ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే యోని పొడిబారుతుంది. కణజాలాలు పొడిగా మారడం వల్ల భార్యాభర్తల కలయికలో అసౌకర్యం, నొప్పికి దారితీస్తుంది. క్రమంగా శృంగారంలో పాల్గొంటే కండరాల టోనింగ్ బలోపేతమై లైంగిక ఆనందాన్ని, తృప్తిని పొందేలా ప్రేరేపిస్తాయి. శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండటం వలన కటిఫ్ఱోర్ కండరాలు బలహీనపడి ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

భావోద్వేగ సమస్యలు

భార్య భర్తలు కలయికలో ప్రేమ అతి ముఖ్యమైనది. ఎక్కువ కాలం శారీరకంగా దూరంగా ఉన్న భార్య భర్తల మధ్య భావోద్వేగ సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఆడ, మగవారిలో కోపం, అసహనం, బాధ, చిరాకు, వంటి సమస్యలు అధికమై సంతోషకరమైన జీవితానికి దూరమవుతారని, దీని వలన తరచూ గొడవలు, కొట్లాటలకు దారి తీస్తుందని చెప్తుతున్నారు.




Tags:    

Similar News