అంతా అయిపోయిందనుకున్నారు... కానీ, ఈ డాక్టరమ్మ పసిబిడ్డ ప్రాణాలను ఎలా కాపాడిందో చూడండి(వీడియో)
పాత వీడియోనే అయినప్పటికీ తాజాగా మరోసారి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పసిబిడ్డకు వైద్యురాలు ప్రాణం పోసిన తీరు ప్రశంసలు....agra doctor saved the life of newborn
దిశ, వెబ్ డెస్క్: పాత వీడియోనే అయినప్పటికీ తాజాగా మరోసారి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పసిబిడ్డకు వైద్యురాలు ప్రాణం పోసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. నెటిజన్స్ చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాలోని సీహెచ్ సీలో ఓ శిశువు పుట్టింది. అయితే, పుట్టిన వెంటనే ఆ శిశువు ఏడువలేదు. దీంతో ఆక్సిజన్ పెట్టారు. అయినా కూడా ఆ శిశువులో కదలిక లేకపోవడంతో వైద్యురాలు ఆ శిశువుకు ప్రాణం పోసింది. తన నోటి ద్వారా ఆ శిశువుకు శ్వాస ప్రారంభించింది. 7 నిమిషాల తర్వాత ఆ శిశువులో కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
— SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक 'माउथ टू माउथ रेस्पिरेशन' दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ