మీరు ఆరోగ్యంగా ఉండాలా?.. అయితే ఫ్రెండ్‌షిప్ చేయండి!
రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని, దీర్ఘాయువుకు దోహదం చేస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
దిశ, ఫీచర్స్ : రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని, దీర్ఘాయువుకు దోహదం చేస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మరి ఫ్రెండ్‌షిప్ విషయంలో ఏం జరుగుతుంది? అనేది తెలుసుకునేందుకు అమెరికాలోని క్లేర్‌మాంట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీకి చెందిన మానసిక నిపుణులు ఇటీవల ఒక పరిశోధన నిర్వహించారు. రొమాంటిక్ రిలేషన్స్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు. ఇవి రెండు కూడా తమ తమ మార్గాల్లో అనేక ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు కలిగి ఉంటాయని 97 దేశాలకు చెందిన డేటాను ఎనలైజ్ చేయడం ద్వారా పరిశోధకులు కనుగొన్నారు.
ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు తమ ఫ్రెండ్స్‌తో తరచూ మాట్లాడటం, సలహాలు పొందడం, సరదాగా గడపడం, మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, బాధలు, సంతోషాలు పంచుకోవడం, ఒకరికొకరు సపోర్టుగా నిలవడం వంటి ప్రవర్తనల ద్వారా అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. దీంతో అనేక మానసిక రుగ్మతలు దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి సోషల్ ఐసోలేషన్‌తో బాధపడుతున్నప్పుడు ఆ పరిస్థితి అతని ఫిజికల్ హెల్త్‌పై కూడా నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. బాడీలోని వైట్‌బ్లడ్ సెల్స్ పనితీరులో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. ఈ స్విచ్యుయేషన్ మరింత అనారోగ్యానికి దారితీస్తుంది. అంటే.. సోషల్ కనెక్షన్స్ కేవలం మానసికంగానే కాకుండా, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తంచుకోవాలి. ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే ప్రతికూల పరిస్థితుల సందర్భంలో మంచీ చెడు చర్చిస్తుండటం, సలహాలు, సహాయం పొందడం వ్యక్తుల్లో పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతాయి. ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. హైపర్ టెన్షన్ రిస్కును దూరం చేస్తాయి. ఆపద సమయాల్లో తమకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుందనే ఫీలింగ్స్, పరస్పర నమ్మకాలు మెదడులో ఎండార్ఫిన్ వంటి హ్యాపీనెస్‌కు కారణం అయ్యే హర్మన్లను రిలీజ్ చేస్తాయి. చక్కటిని నిద్రను ప్రేరేపించడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తాయి.
Read more : ఉదయాన్నే ఈ ఐదు ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?