డిప్రెషన్‌కు దారితీస్తున్న మిల్క్ టీ.. ఎందుకో తెలుసా?
కొందరికి మిల్క్ టీ, బుబుల్ టీ వంటివి తాగే అలవాటు ఉంటుంది.
దిశ, ఫీచర్స్: కొందరికి మిల్క్ టీ, బుబుల్ టీ వంటివి తాగే అలవాటు ఉంటుంది. ప్రజెంట్ ఇండియాకంటే కూడా చైనా, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి మసాలా పానీయాలు చాలా ఫేమస్ అయి పోయాయి. ముఖ్యంగా చైనీస్ యువత మిల్క్ టీ తాగడానికి చాలా ఆసక్తి చూపుతుందట. సాధారణ టీ మాదిరిగానే దీనిని తయారు చేస్తారు. కానీ పాలు, పాల మీగడ ఎక్కువగా వేయడంతో రుచిగా ఉంటుంది. కొంతకాలం దీనిని తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా చేస్తుందని, అంతేకాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక రుగ్మతలకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
స్టడీలో భాగంగా సింఘువా యూనివర్సిటీ అండ్ చైనాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్‌కు రీసెర్చర్స్ బీజింగ్‌లోని 5,281 మంది కాలేజ్ స్టూడెంట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మిల్క్ టీ వినియోగం మానసిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందనే నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే పాలతో చేసిన టీలో ఎక్స్‌ట్రా షుగర్ కంటెంట్‌కు మించిన కెఫిన్ ఉంటుందని, ఇది వ్యక్తుల్లో మానసిక కల్లోలం, సోషల్ ఐసోలేషన్‌కు దోహదపడే భావాలను ప్రేరేపిస్తుందని గుర్తించారు. రోజు మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవడంవల్ల లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్ థాట్స్ వంటి రుగ్మతలు పెరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు