వాకింగ్ స్టైల్‌నుబట్టి మీరెలాంటివారో చెప్పవచ్చు.. ఎలాగంటే..

సాధారణంగా వ్యక్తి నడవడికను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అంటారు.

Update: 2023-09-25 06:08 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా వ్యక్తి నడవడికను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అంటారు. కానీ జర్మన్ సైకాలజిస్టు కెవిన్ వోల్ఫ్ వ్యక్తుల నడకను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని చెప్తున్నాడు. 1936లో మొట్ట మొదటిసారి జరిగిన ఒక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని అతను గుర్తు చేస్తున్నాడు. దాని ఆధారంగా తాను కూడా పలువురి వాకింగ్ స్టైల్‌ను అబ్జర్వ్ చేసిన వోల్ఫ్ ఏ వాకింగ్ స్టైల్ ఎటువంటి పర్సనాలిటీ కలిగి ఉండవచ్చునో పేర్కొన్నాడు.

ముఖ్యంగా ఒంటరిగా నడవడానికి ఇష్టపడే వ్యక్తులు ఎక్కువగా చేతులు జోడించి వాకింగ్ చేస్తుంటారని, ఇటువంటి వారు సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలకు ప్రయారిటీ ఇస్తారని తెలిపాడు.

ఇక స్లో వాకింగ్ చేస్తున్న వ్యక్తుల కాలి అడుగుల మధ్య దూరం ఎక్కువగా ఉంటే వారు మల్టీ టాస్కింగ్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. చాలా విషయాల్లో క్రియేటివిటీ ప్రదర్శించ గలుగుతారు.

షోల్డర్స్ నిటారుగా పెట్టి నడిచేవారు ఎక్కువగా సైలెంట్‌గా, అట్రాక్టివ్ పర్సనాలిటీని కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు ఇతరులను ప్రభావితం చేయగలవారిగానూ ఉంటారని వోల్ఫ్ తెలిపాడు.

ఇక యాక్టివ్ వాకింగ్ స్టైల్ కలిగిన వారు ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటారు. మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా గుర్తింపు పొందుతారు. వీరు తమ రోజువారీ పనులు కూడా త్వరగా పూర్తి చేయగలుగుతారని వోల్ఫ్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News