నెలల పిల్లాడికి సిగరేట్ తాగించాడు.. చివరికి..?! (వీడియో)
తల్లి సోదరి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. Faces up to 20 years in prison if found guilty.
దిశ, వెబ్‌డెస్క్ః అత్యంత బాధ్యతారహితమైన చర్యలో ఓ వ్యక్తి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. మలేషియాలోని బందర్ బారు ఉడాలో ఒక వ్యక్తి, పసికందు నోటిలోకి ఇ-సిగరేట్ పెట్టాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ది స్టార్ నివేదిక ప్రకారం, 23 ఏళ్ల అనుమానితుడు ఆ చిన్నారి పినతల్లికి స్నేహితుడు. బర్గర్ విక్రేతగా పని చేస్తున్నాడు. అయితే, గత శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బందర్ బారు ఉడాలో నిందితుడు చిన్నారి అత్త, తల్లితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంలో, అతడు సరదాగా ఇ-సిగరెట్‌ను శిశువు నోటిలో పెట్టాడు. ఈ వీడియోలో వేప్ పరికరాన్ని శిశువు నోటిలోకి చాలాసార్లు ఉంచడం చూడొచ్చు. ఇక్కడ ఒక స్త్రీ నవ్వుతూ "పేకా రెకోడ్, ఆహ్ (బ్రేకింగ్ రికార్డ్, ఆహ్)" అని చెప్పడం వినబడుతుంది. అయితే, శిశువు సిగరెట్ నుండి ఎటువంటి పొగలు పీల్చుకోలేదు. "దీన్ని తల్లి సోదరి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది'' అని నార్త్ జోహార్ బారు జిల్లా పోలీసు కమాండర్ రూపయ్య అబ్ద్ వాహిద్ తెలిపారు.
— . (@fanaizty) August 5, 2022
ఆగష్టు 6న, క్లిప్ వైరల్ అయిన తర్వాత, పిల్లాడి తల్లి అతనిపై కేసు పెట్టింది. విచారణ ప్రారంభించిన కొద్దిసేపటికే, పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యక్తి శిశువుకు వేప్ ఇచ్చినప్పుడు అది పనిచేయలేదని పేర్కొన్నాడు. అలాగే, తన సోషల్ మీడియా పేజీలో పరిస్థితిని వివరిస్తూ ఒక ప్రకటన కూడా చేసాడు. ఇక, ఈ కేసులో న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించినట్లయితే, అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, RM50,000 (£9,279) జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అమరుడైన జవానుకి రాఖీ కట్టిన సోదరి.. గుండె కరిగే దృశ్యం!