గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ పేరు Lenovo Legion Y90. ప్రత్యేకంగా గేమింగ్‌ కోసం ఈ ఫోన్ తయారు చేశారు. గేమింగ్స్ ఆడేవారికి నిజమైన గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి భారీ డిస్‌ప్లే‌ను అమర్చారు. డిజైన్ పరంగా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. గేమింగ్స్ ఆడాలనుకునేవారికి ఈ ఫోన్ సరి కొత్త అనుభవాన్ని అందించనుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 20-30 […]

Update: 2021-12-27 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ పేరు Lenovo Legion Y90. ప్రత్యేకంగా గేమింగ్‌ కోసం ఈ ఫోన్ తయారు చేశారు. గేమింగ్స్ ఆడేవారికి నిజమైన గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి భారీ డిస్‌ప్లే‌ను అమర్చారు. డిజైన్ పరంగా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. గేమింగ్స్ ఆడాలనుకునేవారికి ఈ ఫోన్ సరి కొత్త అనుభవాన్ని అందించనుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 20-30 నిమిషాల గేమింగ్ తర్వాత కూడా ఫోన్ హీట్ కాకుండా.. నార్మల్‌గానే ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్..
Lenovo Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ 6.92-అంగుళాల E4 AMOLED HD స్క్రీన్‌తో, 144Hz రిఫ్రెష్ రేట్, 720Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్-ఇంజన్ ఎయిర్-కూల్డ్ సిస్టమ్‌‌ను కలిగి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 888పై పనిచేసే అవకాశం ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ కాకుండా ఉండడానికి 120fps కి సపోర్ట్‌గా వస్తుంది. నిరంతరాయంగా గేమ్స్ ఆడుకోవడానికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ త్వరలో ప్రకటించనుంది.

Tags:    

Similar News