పోడుభూముల రక్షణకై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

దిశ, మణుగూరు: పోడు భూముల రక్షణకై సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వామపక్షాల జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి పిలుపునిచ్చారు. మంగళవారం మణుగూరు మండల పరిధిలోని పెద్దిపల్లి ఆదివాసి గ్రామంలో బాబురావు అధ్యక్షతన ప్రచారసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లడుతూ….ఏజెన్సీ ప్రజల జీవనాధారమైన పోడుభూమి సమస్య తీవ్ర జటిలంగా మారిందని, […]

Update: 2021-07-06 08:19 GMT

దిశ, మణుగూరు: పోడు భూముల రక్షణకై సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వామపక్షాల జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి పిలుపునిచ్చారు. మంగళవారం మణుగూరు మండల పరిధిలోని పెద్దిపల్లి ఆదివాసి గ్రామంలో బాబురావు అధ్యక్షతన ప్రచారసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లడుతూ….ఏజెన్సీ ప్రజల జీవనాధారమైన పోడుభూమి సమస్య తీవ్ర జటిలంగా మారిందని, పోడు సాగు దారులకు జీవస్మరణ సమస్యగా ముందుకోచ్చిందన్నారు.

నిరుపేద ఆదివాసి గిరిజనులకు పోడుభూములపై హక్కు కల్పించాల్సిన ప్రభుత్వాలు, ఎన్నికలప్పుడు మాత్రమే పోడుభూముల సమస్యను ఉచ్చరిస్తున్నారే తప్ప పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల పేదల భూములు చుట్టూ కందకాలు తవ్వి బలవంతంగా గుంజుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఏజెన్సీ ఏరియాలో 1/70 చట్టం, పైసా చట్టం, తదితర గిరిజన చట్టాలను ఫారెస్ట్ అధికారులు గానీ, ఇతర ఉన్నత ప్రభుత్వాధికారులు గానీ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పోడు భూముల రక్షణకై వామపక్ష విప్లవ పార్టీల పిలుపులో భాగంగా ఈనెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శన, ధర్నాను
విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భద్రయ్య,భీమయ్య, ఉంగయ్య,దేవయ్య,చుక్కయ్య,బొల్లేం సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News