‘పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’
దిశ, మెదక్: లాక్‌డౌన్ కాలంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గుండు భూపేశ్ విమర్శించారు. ఈ మేరకు పేదలను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా మౌన దీక్షలకు టీడీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుండు భూపేశ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంట్లో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వలస కార్మికులు, […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ కాలంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గుండు భూపేశ్ విమర్శించారు. ఈ మేరకు పేదలను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా మౌన దీక్షలకు టీడీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుండు భూపేశ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంట్లో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనేక మంది పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అందడం లేదన్నారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి వెంటనే నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ ఉచితంగా అందించాలని కోరారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Tags : tdp Leaders, silence protect, medak, lackdown, formers, poor people