'ఇప్పటికీ.. అతీగతీ లేదు'

దిశ, బోధన్: పెద్ద మావాంది కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఎం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏశాల గంగాధర్ మాట్లాడుతూ బోధన్ మండలంలో నిరుపేదలు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలతో సాధించుకుంటామన్నారు. ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బోధన్ పట్టణంలో అతీగతీ లేదని ఆయన మండిపడ్డారు. 20 […]

Update: 2020-07-21 03:59 GMT

దిశ, బోధన్: పెద్ద మావాంది కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఎం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏశాల గంగాధర్ మాట్లాడుతూ బోధన్ మండలంలో నిరుపేదలు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలతో సాధించుకుంటామన్నారు. ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బోధన్ పట్టణంలో అతీగతీ లేదని ఆయన మండిపడ్డారు. 20 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిరుపేదలకు ఇవ్వకుండా గ్రామ ఎంపీటీసీ తన పలుకుబడిని ఉపయోగించి సంబంధిత టీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకుని, వాటిని నిరుపేదలకు అందజేసే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి అందజేశారు. ఈ కార్యక్రమంలో నజీర్, సాయిలు, పోశెట్టి, రాములు మల్లయ్య, పోశెట్టి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News