లక్షల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తే మా ధ్యేయం : సీరమ్ కంపెనీ
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 3 నెలల్లో కొన్ని లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా తెలిపారు. ఇప్పటికే ఇతర వ్యాధులకు సంబంధించి 1.50 బిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిపి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా గుర్తింపు […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 3 నెలల్లో కొన్ని లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా తెలిపారు. ఇప్పటికే ఇతర వ్యాధులకు సంబంధించి 1.50 బిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిపి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే డీసీజీఐ అనుమతి కూడా పొందిందని పూనావాలా తెలిపారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికాతో కలిసి ఇది కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుందని స్పష్టంచేశారు. అన్ని ట్రయల్స్ పూర్తిచేసుకుని లైసెన్స్ పొందిన తర్వాత ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి ప్రారంభమవుతుందని, అయితే, ఆ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని పూనావాలా అభిప్రాయం వ్యక్తంచేశారు.