కడుపులో అది పెట్టి కుట్లు వేసిన వైద్యులు.. స్కానింగ్‌లో చూసి షాక్

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళకు రెండు నెలల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. తర్వాత వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్య సిబ్బంది, కోలుకున్నందంటూ ఇంటికి పంపించేశారు. అయితే, రెండు నెలలుగా కడుపులో నొప్పి తగ్గకపోగా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో మరోసారి ఆమెను అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు స్కానింగ్ తీయించగా అసలు విషయం బయటపడింది.  సిజేరియన్ చేసే సమయంలో […]

Update: 2021-07-18 23:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళకు రెండు నెలల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. తర్వాత వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్య సిబ్బంది, కోలుకున్నందంటూ ఇంటికి పంపించేశారు. అయితే, రెండు నెలలుగా కడుపులో నొప్పి తగ్గకపోగా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో మరోసారి ఆమెను అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు స్కానింగ్ తీయించగా అసలు విషయం బయటపడింది. సిజేరియన్ చేసే సమయంలో మహిళ కడుపులో గుడ్డ ముక్కను మరచి వైద్యులు కుట్లు వేశారని గుర్తించారు. దీంతో మహిళను వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసి గుడ్డ ముక్కను తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం పై మండిపడ్డ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు

Tags:    

Similar News