ఆ పనులు చేయండి.. కేసీఆర్‌కు కేటీఆర్ రిక్వెస్ట్
దిశ, సిరిసిల్ల: కార్మిక, ధార్మిక, కర్షకుల నిలయం రాజన్న జిల్లా అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడేళ్లలో అద్భుతాలు జరిగాయని, రాష్ట్రానికే జంక్షన్‌లా జిల్లా నిలిచిందన్నారు. ఇక్కడ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కారణంగా ఆరు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, యువ ఐఏఎస్‌లకు పాఠ్యాంశగా చేర్చారని కేటీఆర్ అన్నారు. అప్పర్ మానేరుతో మా నాయనమ్మ ఇళ్లు, మిడ్ మానేరుతో మా అమ్మమ్మ ఇళ్లు మునిగిపోయిందని కేటీఆర్ వివరించారు. మానేరు నదిపై 11 చెక్ డ్యాంలను, మూల […]
దిశ, సిరిసిల్ల: కార్మిక, ధార్మిక, కర్షకుల నిలయం రాజన్న జిల్లా అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడేళ్లలో అద్భుతాలు జరిగాయని, రాష్ట్రానికే జంక్షన్‌లా జిల్లా నిలిచిందన్నారు. ఇక్కడ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కారణంగా ఆరు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, యువ ఐఏఎస్‌లకు పాఠ్యాంశగా చేర్చారని కేటీఆర్ అన్నారు. అప్పర్ మానేరుతో మా నాయనమ్మ ఇళ్లు, మిడ్ మానేరుతో మా అమ్మమ్మ ఇళ్లు మునిగిపోయిందని కేటీఆర్ వివరించారు.
మానేరు నదిపై 11 చెక్ డ్యాంలను, మూల వాగుపై 13 చెక్ డ్యాంలను ఏర్పాటు చేశారని, మరో 12 చెక్ డ్యాంలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కేటీఆర్ కోరారు. అప్పర్ మానేరు 75 ఏళ్ల క్రితం నిర్మించారని ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. వేములవాడ ఆలయ అభివృద్ది కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ తో పాటు, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కేటీఆర్ సీఎంను కోరారు.