ఎర్రకోటపై తొలిసారిగా కిసాన్ జెండా
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతంగా మారింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. త్రివిధ దళాల కవాతకు పోటీగా రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. ఎర్రకోటపై కిసాన్ జెండాను ఎగురవేశారు రైతులు. ఎర్రకోటపైకి ఎక్కి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో శకటాల ప్రదర్శన నిలిచిపోయాయి.. రైతుల ర్యాలీ నేపథ్యంలో వేలాదిగా మోహరించిన భద్రతాల బలగాలను దాటుకుని […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతంగా మారింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. త్రివిధ దళాల కవాతకు పోటీగా రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. ఎర్రకోటపై కిసాన్ జెండాను ఎగురవేశారు రైతులు. ఎర్రకోటపైకి ఎక్కి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో శకటాల ప్రదర్శన నిలిచిపోయాయి..
రైతుల ర్యాలీ నేపథ్యంలో వేలాదిగా మోహరించిన భద్రతాల బలగాలను దాటుకుని ఢిల్లీ నడిబొడ్డుకు దూసుకొచ్చారు రైతులు. పలు చోట్ల లాఠీ ఛార్జ్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా రైతులు లెక్కచేయడం లేదు. పోలీసు వాహనాలు, ప్రజా ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో పలువురు పోలీసులు, రైతులకు తీవ్రగాయాలయ్యాయి. దేశ చరిత్రలో ఎర్రకోటపై తొలిసారిగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆందోళనతో ఢిల్లీలో మెట్రోస్టేషన్లు మూసివేశారు.