పాప ఏడ్చింది.. సెల్‌ఫోన్ ఇయ్యమని చెప్పు!

చిన్నారులకు అన్నం తినిపించాలంటే.. ఒకప్పుడు అమ్మలు… చందమామను చూపిస్తూ.. పాటలు పాడుతూ బుజ్జగిస్తూ, లాలిస్తూ అన్నం పెట్టేవాళ్లు. చుక్కలు చూపిస్తూ.. ఇల్లంతా తిప్పుతూ ముద్ద పెట్టేవారు. అత్తదో ముద్ద, అన్నదో ముద్ద, నాన్నమ్మ, తాతయ్యల ఇలా ఇంటిల్లిపాది పేర్లు చెబుతూ.. చిన్నారులు కడుపు నింపేవారు. చంద్రుడు మారలేదు, చుక్కలు చెదిరిపోలేవు.. కానీ, రోజులు మారిపోయాయి. ఇప్పుడంతా టెక్నాలజీమయం. పుట్టినప్పటి నుంచే.. పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు… అది ఎప్పుడు ఎలా మొదలవుతుంది అంటే.. ఓ ముప్పై సంవత్సరాలు […]

Update: 2020-03-19 07:36 GMT

చిన్నారులకు అన్నం తినిపించాలంటే.. ఒకప్పుడు అమ్మలు… చందమామను చూపిస్తూ.. పాటలు పాడుతూ బుజ్జగిస్తూ, లాలిస్తూ అన్నం పెట్టేవాళ్లు. చుక్కలు చూపిస్తూ.. ఇల్లంతా తిప్పుతూ ముద్ద పెట్టేవారు. అత్తదో ముద్ద, అన్నదో ముద్ద, నాన్నమ్మ, తాతయ్యల ఇలా ఇంటిల్లిపాది పేర్లు చెబుతూ.. చిన్నారులు కడుపు నింపేవారు. చంద్రుడు మారలేదు, చుక్కలు చెదిరిపోలేవు.. కానీ, రోజులు మారిపోయాయి. ఇప్పుడంతా టెక్నాలజీమయం. పుట్టినప్పటి నుంచే.. పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు… అది ఎప్పుడు ఎలా మొదలవుతుంది అంటే..

ఓ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళితే.. ఇంట్లో పాపో, బాబో పుడితే.. పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాళ్లు. అక్కడున్న ఇంటి సభ్యులను, చుట్టాలను ఆలింగనం చేసుకుని తమ ఆనందాన్ని పంచుకునేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ సంతోషాల మధ్యలోకి ‘‘సెల్‌ఫోన్’’ వచ్చి దూరింది. ఇప్పుడు ఇంట్లో అందరికంటే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్. కబుర్లైనా.. కథలైనా.. బాధైనా, సంతోషమైనా అన్ని దానితోనే. కంగ్రాట్స్ సార్.. మీకు బేబీ పుట్టిందని డాక్టర్ అలా చెబుతుండగానే.. ఆయన చెప్పేది సరిగ్గా వినకుండా.. అసలు ఆయన్ని పట్టించుకోవడమే మానేసి.. సెల్ఫోన్లో తీసి.. టకాటకా.. ఫేస్‌బుక్ గోడమీద, వాట్సాప్ స్టేటస్ పైన ‘ఐ యామ్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్’ అని రాసేయడమే. అంతే అక్కడే సగం ఆనందం చచ్చిపోయింది. ఇక లోపలికి వెళ్లగానే.. పాపను ప్రేమగా చేతుల్లోకి తీసుకోవడం మానేసి.. ఫటాఫట్ ఫోటోలు, వీడియోలు తీసేయాలి, వాటిని మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి. అరే అప్పుడే పుట్టిన పాప చర్మం ఎంత సున్నితంగా ఉంటుంది. ఆ స్కిన్ పై సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ పడితే.. తట్టుకుంటుందా? అప్పడే కళ్లు తెరిచినా ఆ పసి పాప కళ్లలోకి నీలి రంగు లైట్ పడితే.. రెటినీ దెబ్బతినదా? సెల్ ఫోన్ రేడీయేషన్ ఎంత ప్రమాదం. పక్కనే పాపకు జన్మనిచ్చిన తల్లి ఉంటుంది. రేడియేషన్ వల్ల ఆమె ఆరోగ్యం కూడా పాడవదా? ఇవేవీ అవసరం లేదు. అంతా సోషల్ లైఫే. అంతా సమాజం కోసం బతకడమే. జీవితంలోని మధురమైన అనుభూతిని మిస్ చేసుకుని.. ఎవరికో.. ఏదో చెప్పాలనే తాపత్రయం ఎందుకు. అలా పుట్టిన క్షణం నుంచే సెల్ ఫోన్.. ఆ చిన్నారుల పక్కలోకి చేరుతుంది. ఆ బేబీ పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు వరకు రోజూ ఫోటోలు, వీడియోలే. పాప ఏడిస్తే.. సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపించడం, ఫొటోలు చూపించడం అంతేకానీ .. ఆటలు ఆడించడం, బొమ్మలివ్వడం, కథలు చెప్పడం అన్నీ మరిచారు. కథ చెప్పమంటే.. యూ ట్యూబ్ ఓపెన్ చేయాలి కథలు వినిపించాలి. పాప తినాలంటే.. సెల్ లో కార్టూన్, జంతువులు, బొమ్మలకు సంబంధించిన ఏదో ఒక వీడియో పెట్టాలి.. తినిపించాలి. పాప ఏడిస్తే ఆడుకోవడానికి సెల్ ఫోన్ ఇవ్వాలి. పాప రైమ్స్ కావాలంటే సెల్ ఫోన్ లో వినమని చెప్పాలి. గేమ్స్ కూడా ఫోనులోనే ఆడిస్తారు. ఇంకా కొందరైతే.. సెల్‌ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ.. ఏదో ఘన కార్యం చేసినట్లు గొప్పగా ఫీలవుతారు. పైగా మనం వాడేవి చైనా ఫొన్లు. వాటిల్లో రేడియేషన్ లెవల్ చాలా ఎక్కువగా ఉంటుంది.

అలవాటు.. వ్యసనంగా..

పిల్లలు మారాం చేసినా, అల్లరి చేసినా, అలిగినా.. ఫోన్ ఇచ్చి అందులో గేమ్ అడుకోమ్మనో, లేదా వీడియోలు చూడమనో చాలామంది పేరేంట్స్ చెబుతుంటారు. అలా తల్లిదండ్రులే తమ పిల్లలకు ఫోన్ ను క్రమంగా అలవాటు చేస్తారు. అది కాస్త వ్యసనంగా మారుతుంది. పదేళ్లు రాగానే.. పాత జనరేషన్లో సైకిల్ కావాలని అడిగేవారు.. కానీ, ఈ జనరేషన్లోని పిల్లలు తమకు సెల్ ఫోన్ కొనివ్వమని పట్టు పడుతున్నారు. కొనివ్వకపోతే ఇంట్లోని వస్తువులు పగలగొట్టేవారు కొందరుంటే, ఇంకొందరేమో దొంగతనాలు చేస్తున్నారు. మరికొందరైతే.. ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని బెదరిస్తుంటారు.

తల్లిదండ్రులదే తప్పు:

ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టడం కంటే ముందు తల్లిదండ్రులనే దోషులుగా చెప్పడం సబబు. ఎందుకంటే.. వారికి టైమ్ ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా.. పిల్లలకు సమయమివ్వకుండా, వారితో స్పెండ్ చేయకుండా.. సెల్ఫోన్ ఇచ్చి ఆడుకోమనడం ఒక తప్పు. తమ పిల్లల ముందు.. ఎప్పుడూ సెల్ఫోనే ప్రపంచంగా బతకడం.

మరి ఏం చేయాలి..

వీలైనంతగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం ఇవ్వాలి. సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలను వారికి చెప్పాలి. తాము కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అయితే తప్ప ఫోన్ కు దూరంగా ఉండాలి. ఫొటోలను, వీడియోలను సెల్ ఫోన్ కంటే.. కెమెరాతోనే తీయడం ఉత్తమం. చిన్నాలనే కాదు.. పెద్దలకు కూడా సెల్ఫోన్ నుంచి వచ్చే స్ర్కీన్ లైట్ చర్మాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలను గ్రౌండ్లో ఆడుకోనివ్వాలి. కాలక్షేపానికి కథలు పుస్తకాలు ఇచ్చి చదవమనాలి. పిల్లలతో పేరేంట్స్ అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా తమ బాల్యాన్ని ఎలా గడిపారో వారికి వివరించాలి.

Tags : children, cell phone, skin disease, radiation, games, parents, time pass, stories, cartoon, songs, videos, youtube

Tags:    

Similar News