ఖాదీ సంస్థ : రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా ఇంకా విధుల్లోనే..

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని వావిలాల ఖాదీ సంస్థ ముందు అందులో పనిచేసే పలువురు ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రకాష్ రావు అనే ఉద్యోగి తన పదవీ కాలం పూర్తయినప్పటికీ వెళ్లిపోకుండా ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతున్నాడు. దీనిని ఖండిస్తూ ఖాదీ విక్రయదారుల మేనేజర్లు, కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే, ప్రకాష్ రావు ఉద్యోగ కాల పరిమితి వాస్తవానికి గతేడాదిలో ముగిసినప్పటికీ, సంస్థ చైర్మన్, కార్యదర్శులు మరో ఏడాది […]

Update: 2021-06-03 12:11 GMT

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని వావిలాల ఖాదీ సంస్థ ముందు అందులో పనిచేసే పలువురు ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రకాష్ రావు అనే ఉద్యోగి తన పదవీ కాలం పూర్తయినప్పటికీ వెళ్లిపోకుండా ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతున్నాడు. దీనిని ఖండిస్తూ ఖాదీ విక్రయదారుల మేనేజర్లు, కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే, ప్రకాష్ రావు ఉద్యోగ కాల పరిమితి వాస్తవానికి గతేడాదిలో ముగిసినప్పటికీ, సంస్థ చైర్మన్, కార్యదర్శులు మరో ఏడాది పాటు పొడిగించినట్లు తెలుస్తోంది.

అతను తిరిగి ఏడాది కాలం పూర్తి చేసుకోవడంతో సంస్థ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎందుకనగా, మరో ఏడాది పాటు ఉద్యోగ కాల పరిమితిని పొడగిస్తూ ఖాదీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి ఒడితల కిషన్ బాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ప్రకాశ్ రావు విధుల్లోనే కొనసాగుతున్నారు. కాగా, గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కేవీ నరసింహారావు పదవీకాలం పూర్తయినప్పటికీ ఆనాడు ఆ సంస్థ చైర్మన్, కార్యదర్శులు 8 సంవత్సరాల పాటు పదవీ కాలన్ని పొడిగించినట్లు తేలింది.

Tags:    

Similar News