కేసీఆర్ వాగ్ధానం మోసం చేయడమే

దిశ, తెలంగాణ బ్యూరో : ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లను 12శాతం పెంచుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానం మోసం చేయడమేనని, ఆచరణాత్మకంగా, చట్టబద్ధంగా అసాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం వర్చువల్ పద్ధతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు తీర్పుతో ముస్లింల కోటా 4శాతం తగ్గకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్లను […]

Update: 2021-05-07 08:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లను 12శాతం పెంచుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానం మోసం చేయడమేనని, ఆచరణాత్మకంగా, చట్టబద్ధంగా అసాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం వర్చువల్ పద్ధతిలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు తీర్పుతో ముస్లింల కోటా 4శాతం తగ్గకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్లను రద్దు చేయడంతో పాటు, ఏ రాష్ట్రంలో కూడా 50శాతంపైగా రిజర్వేషన్లు మించకూడదని సూచించిందన్నారు. అదనపు-సాధారణ పరిస్థితులలో తప్పా… రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని అయితే తీర్పును పున సమీక్షించాలన్న డిమాండ్లను లేదా పునపరిశీలన కోసం బెంచ్‌కు సూచించాలన్న డిమాండ్లను సైతం తిరస్కరించిందని తెలిపారు.

విద్య, ఉద్యోగాలలో 4శాతం ముస్లిం కోటాను సైతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కోత విధించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల జాబితాను రాష్ట్రాలు నిర్ణయించలేవని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బీసీ-ఇ ​​జాబితా ద్వారా అమలు చేయబడుతున్న 4శాతం ముస్లింల కోటాను ప్రభావితం చేస్తోందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలలో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేకపోయారని ఆరోపించారు.

Tags:    

Similar News