పీఆర్సీ : అసెంబ్లీలో కేసీఆర్ సంచలన ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​ను సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. అదే విధంగా పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడారు. ఉద్యోగులతో ప్రభుత్వం ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇచ్చామన్నారు. గతంలో 43 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని సీఎం గుర్తుచేశారు. కరోనాతో […]

Update: 2021-03-22 01:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​ను సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. అదే విధంగా పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడారు.

ఉద్యోగులతో ప్రభుత్వం ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇచ్చామన్నారు. గతంలో 43 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని సీఎం గుర్తుచేశారు. కరోనాతో 11వ పీఆర్సీ ఆలస్యమైందని, అయినా మెరుగైన రీతిలో వేతన సవరణ చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న చిరుద్యోగుల వేతనాలను కూడా పెంచారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్​వాడీలు, ఆశా వర్కర్లు, విద్యావలంటీర్లు, సెర్ప్​ ఉద్యోగులు, వీఆర్​ఏలు, వీఏఓలందరికీ రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. వేతన సవరణతో పాటుగా పదోన్నతుల ప్రక్రియ కూడా చేపట్టామన్నారు. అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతుల ప్రక్రియను మొత్తం పూర్తి చేస్తామన్నారు. పదోన్నతుల తర్వాత ఏర్పాటయ్యే ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిపై ఒక స్టీరింగ్​ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

అడిషనల్​ క్వాంటమ్​ పెన్షన్​కు 75 నుంచి 70 ఏండ్లకు తగ్గిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదనపు ప్రధానోపాద్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నామన్నారు. స్పౌస్​ కేసుల విషయంలో కూడా త్వరలోనే ప్రక్రియ చేపట్టుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకువచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. కేజీబీవీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడాని 180 రోజుల సెలవులను ప్రకటిస్తున్నామన్నారు. సీపీఎస్​ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్​ స్కీంను వర్తింప చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. పీఆర్సీ కింద 12 నెలల బకాయిలను చెల్లిస్తామన్నారు. రిటైర్​మెంట్​ బెనిఫిట్​తో ఇస్తామని, రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​ను రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంచుతున్నామనరు. పదవీ విరమణ పెంపును 61 ఏండ్లకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా అభినందనీయమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జై తెలంగాణ నినాదంతో ముందుకు వచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో కొనసాగుతున్న పేరు మార్చుకోకుండా ఉన్న సంఘం టీఎన్జీఓ అని సీఎం కేసీఆర్​ కొనియాడారు. ఆ విశిష్టతను గుర్తు పెట్టుకోవాలన్నారు. కరోనాతో ఈసారి పీఆర్సీ ఆలస్యమవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకున్నామని సీఎం వెల్లడించారు. సీఎస్​ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించామని, తాను కూడా చర్చలు సాగించామన్నారు. టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్​, రాయకంటి ప్రతాప్​, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, ఏనుగుల సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్​రావు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావుతో పాటు ఎమ్మెల్సీలు జనార్ధన్​రెడ్డితో సహా అందరితో మాట్లాడినట్లు సీఎం పేర్కొన్నారు.
Tags:    

Similar News