కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య

చిక్కమగళూరు : జనతాదల్(ఎస్) నేత, కర్ణాటక రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్(65) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం చిక్కమగళూరు జిల్లా కడురు రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ధర్మేగౌడ్ జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదులుతున్న రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో నుంచి శరీర భాగాలను హాస్పిటల్‌కు తరలించామని, దర్యాప్తు జరుపుతున్నామని చిక్కమగళూరు డీసీ డాక్టర్ బాగడి గౌతమ్ […]

Update: 2020-12-29 06:49 GMT

చిక్కమగళూరు : జనతాదల్(ఎస్) నేత, కర్ణాటక రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్(65) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం చిక్కమగళూరు జిల్లా కడురు రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ధర్మేగౌడ్ జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కదులుతున్న రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో నుంచి శరీర భాగాలను హాస్పిటల్‌కు తరలించామని, దర్యాప్తు జరుపుతున్నామని చిక్కమగళూరు డీసీ డాక్టర్ బాగడి గౌతమ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే ఏ విధంగా మృతిచెందారనే విషయం తేలుతుందన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కడూరు సఖరాయపట్టనలోని ఇంటి నుంచి సోమవారం రాత్రి 7గంటలకు ధర్మేగౌడ్ బయల్దేరి వెళ్లారు. అప్పటి నుంచి ఆచూకీ తెలియకుండా పోయింది. ధర్మేగౌడ్‌కు పోలీస్ ఎస్కార్ట్ సౌకర్యం ఉన్నా డ్రైవర్‌తో కలసి సొంత వాహనంలో వెళ్లినట్లు తెలిసింది. కడురు రైల్వే ట్రాక్ సమీపంలోకి చేరుకున్న తర్వాత డ్రైవర్ పంపించి వేసినట్లు సమాచారం.

సమయంలో ఫోన్ రాగా రైల్వే రాకపోకల గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆయన స్విచ్ఛ్ ఆఫ్ అయింది. ధర్మేగౌడ్ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు, పోలీసు ఎస్కార్క్ బృందం ఆయన కోసం గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనమండలి ఒక్కరోజు సమావేశంలో డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ అవమానకరమైన సంఘటన చోటుచేసున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే అనుమానంతో చైర్మన్ స్థానంలో కూర్చున్న ధర్మేగౌడ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లాగేశారు. ఈ సంఘటనపై ధర్మేగౌడ్ మనస్తాపం చెందినట్లు తెలిసింది. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం యెడియూరప్ప స్పందించాడు. ఇది ఊహించని సంఘటన అని, తనను షాక్‌కు గురిచేసిందని తెలిపారు.

డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ్ ఆత్మహత్య‌పై మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘1972 నుంచి ఆయన కుటుంబతో తనకు అనుబంధం ఉంది. గత కొంతకాలంగా రెండు జాతీయ పార్టీల మధ్య డ్రామా నడుస్తున్నది. అంతిమంగా ఎంతో సౌమ్యుడైన కుర్రాడు ప్రాణాలను కోల్పోయాడు. శాసనమండలిలో ధర్మేగౌడ్‌ను తీవ్రంగా అవమానించారు. నన్ను క్షమించండి. నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను’ అని దేవెగౌడ్ పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య పట్ల కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరమైన వ్యక్తి. ధర్మేగౌడ్ ఆత్మహత్య నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.

Tags:    

Similar News