సర్దార్‌కు జై.. టీఆర్ఎస్‌కు నై.. అక్కడిదే గులాబీ నేతల నినాదం!
దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ ఇరువురు ముఖ్యనాయకులు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా నగరంలోని మరికొందరు నాయకులు వారి బాటలోనే సాగుతున్నారు. 51వ డివిజన్‌లోని ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలితో పాటు 25 మంది ముఖ్య కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ అధిష్టానానికి లేఖ […]
దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ ఇరువురు ముఖ్యనాయకులు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా నగరంలోని మరికొందరు నాయకులు వారి బాటలోనే సాగుతున్నారు. 51వ డివిజన్‌లోని ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలితో పాటు 25 మంది ముఖ్య కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ అధిష్టానానికి లేఖ పంపారు.
రాజీనామా చేసిన వారిలో తుల భాస్కర్ రావు, బడనాపురం సరోజ, ఆటో ట్రాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యాల కృష్ణ యాదవ్ తదితరులు న్నారు. అలాగే నగరంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో కొనసాగుతున్న అనేక మందికి ఎలాంటి అవకాశాలు లేక తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ నిర్ణయం ప్రకటించనున్నారనే టాక్ పట్టణంలో విస్తృతంగా వినిపిస్తోంది.