ఉద్యమకారులను గెలిపించి తెలంగాణ ద్రోహులకు బుద్ది చెప్పండి: జోగిరెడ్డి
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ ఉద్యమకారులను పక్కన బెట్టి, ఉద్యమ ద్రోహులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి, తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని ద్రోహుల చేతిలో తాకట్టు పెట్టారని జోగిరెడ్డి ఆరోపించారు. మంగళవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో డబ్బున్నోళ్లకే టికెట్లా అని విమర్శించారు. తానిపర్తి భానుప్రసాద్ రావు ఎవరికి తెలుసని ఏ ఒక్క రోజైనా ఉమ్మడి జిల్లాలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాడా అని ప్రశ్నించారు. శాసన […]
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ ఉద్యమకారులను పక్కన బెట్టి, ఉద్యమ ద్రోహులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి, తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని ద్రోహుల చేతిలో తాకట్టు పెట్టారని జోగిరెడ్డి ఆరోపించారు. మంగళవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో డబ్బున్నోళ్లకే టికెట్లా అని విమర్శించారు. తానిపర్తి భానుప్రసాద్ రావు ఎవరికి తెలుసని ఏ ఒక్క రోజైనా ఉమ్మడి జిల్లాలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాడా అని ప్రశ్నించారు. శాసన మండలి వేదికగా ప్రత్యేక రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడు గళమెత్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రి వర్గంలో ఉద్యమ ద్రోహులు బీటీ బ్యాచ్ (బంగారు తెలంగాణ) తప్ప, ఒరిజినల్ ఉద్యమ కారులు ఎవరైనా ఉన్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ కారులను గెలిపించి, ద్రోహులకు బుద్ధి చెప్పాలని, అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎల్. రమణ, భానుప్రసాద్ రావు లు గెలిస్తే కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలుగా మిగిలిపోవడం తప్ప స్థానిక సంస్థలకు ఒరిగేదేమి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న తనకు వందలాది మంది ఎంపీటీసీల మద్దతు ఉందని, రెడ్డి సామాజిక వర్గంతో పాటు సబ్బండ వర్గాల నుంచి తనకు బలమైన మద్దతు ఉందని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యంతో ప్రభుత్వానికి దిమ్మదిరిగే తీర్పు ఎలా ఇచ్చారో అదే విధంగా ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ మనం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో మంచి మెజార్టీతో గెలిపించి కేసీఆర్ కళ్లు తెరిపించి మన హక్కులను సాధించుకోవడానికి ఇదే మంచి అవకాశమన్నారు. ఉద్యమం ఆరంభం నుంచి కేసిఆర్ తో ఉన్న ఎమ్మెల్యే రాజేందర్ గమనించి తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఆయన వెంట కొండాపూర్, పోరండ్ల, ఇందుర్తి, ముడిమాణిక్యం, లింగాపూర్, ఎంపీటీసీలు రాగుల రమేష్, అందే స్వప్న, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు